Hezbollah: హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా కుమార్తె మృతి

ఇజ్రాయెల్‌.. లెబనాన్‌ వ్యాప్తంగా శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరూట్‌ లోని హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా కుమార్తె జైనబ్‌ మృతి చెందినట్లు సమాచారం.

author-image
By Bhavana
New Update
heyzbullah

Israel: హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌..లెబనాన్‌ వ్యాప్తంగా శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరూట్‌ లోని హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా కుమార్తె జైనబ్‌ మృతి చెందినట్లు సమాచారం. 

ఈ మేరకు ఇజ్రాయెల్‌ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. అయితే ఆమె మృతిని హెజ్‌బొల్లా కానీ, లెబనాన్‌ అధికారులు కానీ ఇంకా ధ్రువీకరించలేదు

హెజ్‌బొల్లాలో జైనబ్‌ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 1997 లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఆమె సోదరుడు హదీ ప్రాణాలు విడిచాడు. దీని గురించి జైనబ్‌ ఆ మధ్య ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ తన కుటుంబం త్యాగాలు, హెజ్‌బొల్లా లక్ష్యాల గురించి వివరించింది. అప్పటి నుంచి ఆమె పేరు వార్తల్లో నిలిచింది. ఇప్పుడామె మరణించినట్లు కథనాలు రావడంతో తాజా పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారే అవకాశాలు ఉన్నాయి.

జైనబ్‌ మృతికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా దాడులను తీవ్రతరం చేయనున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. దక్షిణ లెబనాన్‌ లోని దాహియాలోని నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేక సురక్షిత ప్రాంతాల్లో దాక్కున్నాడా అనే విషయం గురించి తెలియాల్సి ఉంది.

అతను చనిపోయినట్లు మాత్రం ఇప్పుడే చెప్పలేమని ఇజ్రాయెల్‌ చెబుతోంది. అయితే తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్‌ అంటోంది. మరో వైపు హెజ్‌బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతోనే ఉన్నట్లు తెలుపుతున్నాయి. 

ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియలేదు. కానీ అతని కమ్యూనికేషన్‌ మాత్రం లేదని తెలుస్తుంది. ఇక బీరూట్‌ లో దాడుల నేపథ్యంలో హెజ్‌బొల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది. మరో పక్క హెజ్‌బొల్లా  స్థావరాలపైకి యాంటీ షిప్‌ క్షిపణులతో ఐడీఎఫ్‌ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరూట్ సహా లెబనాన్ లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది.

Also Read: తగ్గిన బంగారం ధరలు..తులం ఎంత ఉందంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు