/rtv/media/media_files/2026/03/13/milk-2026-03-13-20-02-46.jpg)
సాధారణంగా ఇరాన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు మాత్రమే. కానీ, ఇప్పుడు ఇరాన్ పాల వ్యాపారంలో కూడా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. చమురు సరఫరా ఆగిపోతే బండ్లు ఆగిపోతాయని మనకు తెలుసు, కానీ ఇరాన్ నుంచి పాలు అందకపోతే పక్కనే ఉన్న అరబ్ దేశాల్లో స్వీట్లు, బిస్కెట్లు, కేకుల తయారీ కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
ఇరాన్ ఇప్పుడు పాలను పొడిగా మార్చే వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇరాన్ ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల ముడి పాలను ప్రాసెస్ చేస్తుంది, దానిలో ఎక్కువ భాగాన్ని స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌గా మార్చి ఎగుమతి చేస్తుంది. స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. పాలలో ఉండే వెన్నను తీసేసి, ఆ పాలను పొడి చేసి ఇతర దేశాలకు పంపిస్తోంది. ఈ పొడిని ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, బేకరీ వస్తువులు, ప్యాకెట్ పాలు తయారు చేయడానికి వాడతారు. 2025 లెక్కల ప్రకారం, ఇరాన్ ఏకంగా 1,82,000 టన్నుల పాల పొడిని విదేశాలకు అమ్మేసింది. ఈ దెబ్బతో ఆస్ట్రేలియా లాంటి దేశాలను కూడా దాటేసి, ప్రపంచంలోనే నాలుగో పెద్ద దేశంగా నిలిచింది. ఇప్పుడు ఇరాన్ కంటే ముందు అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలు మాత్రమే ఉన్నాయి.
పాల పొడిపైనే ఎక్కువగా
ముఖ్యంగా పాకిస్థాన్, ఇరాక్, అఫ్గానిస్థాన్, దుబాయ్ వంటి దేశాలు ఇరాన్ పాల పొడిపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ దేశాల్లో స్వీట్లు, బేకరీ తిళ్లు చాలా ఎక్కువగా తింటారు. ఒకవేళ ఇరాన్‌తో యుద్ధం వచ్చి ఈ సప్లై ఆగిపోతే, ఆ దేశాల్లో పాల ధరలు చుక్కలను తాకుతాయి. ఇప్పటికే యుద్ధం వస్తుందన్న భయంతో చాలా మంది ఈ పాల పొడిని భారీగా కొని దాచుకుంటున్నారు. దీనివల్ల కేవలం రెండు నెలల్లోనే పాల పొడి ధర 23 శాతం పెరిగిపోయింది.
ప్రస్తుతం యుద్ధ వాతావరణం వల్ల చమురు ధరలు పెరిగితే, ఆటోమేటిక్‌గా పాలతో పాటుగా ఇతర ఆహార పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇరాన్ కేవలం యుద్ధ ట్యాంకులతోనే కాదు, తన దగ్గర ఉన్న పాల నిల్వలతో కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్గి రాజేస్తే చమురు మండుతుంది కానీ, ఇరాన్ తలుచుకుంటే పాలు కూడా పిరమైపోతాయని ఈ పరిస్థితులు చెబుతున్నాయి.
Follow Us