/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-11T174610.436.jpg)
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఓ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆమె కుమార్తె సైమా వాజెద్ పుతుల్‌తోపాటు మరో 17 మందిపై అక్రమ నివాస స్థలాన్ని సేకరించిన అవినీతి కేసు నమోదైంది. అవినీతి నిరోధక కమిషన్ సమర్పించిన ఛార్జ్ షీట్‌ను కోర్టు అంగీకరించి గురువారం ఈ కేసు విచారించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పుతుల్ కూడా ఈ కేసులో చిక్కుకున్నారు.
Also read: BIG BREAKING: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్..!
ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి జకీర్ హుస్సేన్ గాలిబ్ ACC చార్జిషీట్‌ను అంగీకరించి, పరారీలో ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఢాకా శివార్లలో ఉన్న పుర్బాచల్ న్యూ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో నివాస స్థలాన్ని పొందడానికి హసీనా, ఆమె కుమార్తె కుంభకోణం చేశారని ఆరోపణల చుట్టూ ఈ కేసు తిరుగుతుంది.