Musi: మూసీ ఎలా మారనుందో తెలుసా?.. రేవంత్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పదం మూసీ అభివృద్ధి. అయితే.. మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారు? అది ఎలా మారనుంది? అన్న విషయంపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా మూసీ ఎలా మారే అవకాశం ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update

Musi Project: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో (Seoul) ఉన్న చియోంగ్‌జియోన్ నది (Cheonggyecheon) అందం చూడడానికి రెండు కళ్లూ చాలవు. నగరం నడిబొడ్డన ప్రవహించే ఈ నది చుట్టూ రోజూ ప్రజలు వాకింగ్ చేస్తారు. సాయంత్రం సరదాగా ఫ్యామిలీతో గడుపుతారు.. ఇటు హైదరాబాద్‌లో ఉన్న మూసీ నది ఇందుకు పూర్తిగా భిన్నం.. మూసీ అంటేనే కంపు అనే పదం గుర్తొచ్చేలా మారిపోయిన కాలమిది. నిజానికి ఏనాటి నుంచో కంపుకు కేరాఫ్‌గా మూసీ మారిపోయింది. అందుకే ఈ నదిని ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారు. చియోంగ్‌జియోన్ నదిలా మూసీ మార్చాలని సంకల్పించారు.

ఆగస్టులో సియోల్ లో రేవంత్ పర్యటన..

హైదరాబాద్‌లోని మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించిన అవగాహనలను సేకరించేందుకు సీఎం రేవంత్‌ గత ఆగస్టు 13న సియోల్‌లో పర్యటించారు. అక్కడ చియోంగ్‌జియోన్ నదిని సందర్శించారు. చియోంగ్‌జియోన్ 10.9 కిలోమీటర్ల పొడవున్న సహజ ప్రవాహం కలిగిన నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీన్ని ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేగా మార్చారు. 2003లో సౌత్ కొరియా ప్రభుత్వం ప్రపంచ స్థాయి పట్టణ నదీతీర ప్రాంతంగా చియోంగ్‌జియోన్‌ను పునరుద్ధరించడానికి రహదారిని కూల్చివేసింది. ఆ తర్వాత ఈ నదిని అందంగా తీర్చిదిద్దారు. అందుకే ఇది ప్రతీ ఏటా దాదాపు 2 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Also Read: గ్రూప్-1 వాయిదా లేనట్లే.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్!

ఈ ప్రాజెక్టు విజయాలివే..

ఈ నదిని సుందరికరించిన తర్వాత సియోల్‌లోని ఇతర ప్రాంతాలలో ఆస్తి పెరుగుదల రేటు రెండింతలు పెరిగింది. ఇక స్వచ్ఛమైన నీరు, సహజ ఆవాసాలతో పర్యావరణాన్ని సృష్టించడం ఈ ప్రాజెక్టు సాధించిన అత్యంత ముఖ్యమైన విజయం. ఎందుకంటే 2003లో ఈ నది పక్షాళన జరిగిన తర్వాత  జీవవైవిధ్యం 639శాతం పెరిగింది.  నదిలోని వృక్ష జాతుల సంఖ్య 62 నుంచి 308కి చేరింది. చేప జాతులు 4 నుంచి 25కి, పక్షి జాతులు 6 నుంచి 36కి చేరింది. అటు క్షీరదాలు 2 నుంచి 4కి, ఉభయచరాలు 4 నుంచి 8కు పెరిగాయి. అటు కాలుష్యం రేటు కూడా గణనీయంగా తగ్గింది. ఈ 20 ఏళ్లలో 35శాతం పొలూష్యన్‌ లెవల్స్‌ పడిపోవడంతో ఆ ప్రాంతంలోని నివాసితుల్లో శ్వాసకోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య తగ్గింది.

Also Read: తెలంగాణలోకి మావోయిస్టు అగ్రనేతలు.. ఆ ఏరియాల్లోనే షెల్టర్‌!

1950-53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధం తరువాత , ఎక్కువ మంది ప్రజలు తమ జీవనం కోసం సియోల్‌కి వలస వచ్చారు. తాత్కాలిక ఇళ్లను ఏర్పాటు చేసుకోని నది ప్రవాహం వెంట స్థిరపడ్డారు. దీని కారణంగా నదిలో చెత్తాచెదారం పెరిగిపోయింది. నదిలో అనేక రకాల వ్యర్థాలను పడేయడం కారణంగా నది కాలుష్యతమైపోయింది. ఇలా 2003 వరకు కొనసాగింది. ఆ తర్వాత నాటి సియోల్ మేయర్ లీ బాక్ అక్కడున్న ఎలివేటెడ్ హైవేని తొలగించారు. ప్రవాహాన్ని పునరుద్ధరించే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కారణంగా నది ప్రవాహం దాదాపు ఎండిపోయింది. దీంతో 1,20,000 టన్నుల నీటిని హాన్ నది, దాని ఉపనదులు, భూగర్భజలాల నుంచి సబ్‌వే స్టేషన్‌ ద్వారా నాడు ప్రతిరోజూ పంప్ చేశారు. ఆ తర్వాత క్రమంగా చియోంగ్‌జియోన్‌ నదికి పూర్వవైభవం వచ్చింది.

Also Read: సజ్జల ఔట్.. సాయిరెడ్డి ఇన్.. జగన్ సంచలన నిర్ణయం!

అక్కడ చియోంగ్‌జియోన్‌ నది సియోల్‌ నగరం నడిబొడ్డన ప్రవహిస్తుంటే ఇక్కడ హైదరాబాద్‌లో మూసీ కూడా అలానే ప్రవహిస్తుంటుంది. అక్కడ కొరియన్‌ యుద్ధం తర్వాత ఈ నది చుట్టూ నిర్మాణాలు ఏర్పడితే.. ఇక్కడ నిజాం పాలన సమయంలోనూ.. ఆ తర్వాత కూడా మూసీ చుట్టూ ఇళ్లు భారీగా పెరుగుతూ వచ్చాయి. పాలకుల నిర్లక్ష్యంతో పాటు మనుషుల విచక్షణారాహిత్యం కారణంగా మూసీ చాలా వరకు చెత్తతో నిండిపోయింది. 2022 ర్యాంకింగ్స్‌ ప్రకారం మూసీ నది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యతమైన నదుల్లో 22వది. అందుకే రేవంత్‌ ఈ నదిని ప్రక్షాళన చేసేందుకు ఎంతదూరమైన వెళ్తున్నారు. చియోంగ్‌జియోన్‌ నది స్ఫూర్తితో ఓ ప్రవాహంలా ముందుకు కదులుతున్నారు.

Also Read: Telangana Cabinet Expansion: సురేఖ ఔట్.. ఆ ఐదుగురు ఇన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు