China: పోర్టులో మునిగిన ..న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్‌!

నేవీ, న్యూక్లియర్‌ విసర్తణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా అణుజలాంతర్గామి నీట మునిగిపోయిందని యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.

New Update
china

China: నేవీ, న్యూక్లియర్‌ విసర్తణ కార్యకలాపాల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. డ్రాగన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అణుజలాంతర్గామి నీట మునిగిపోయిందని యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.

శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి. మాక్సర్‌ టెక్నాలజీస్‌ మార్చి 10న తీసిన శాటిలైట్‌ చిత్రాల ప్రకారం..వుహాన్‌ సమీపంలోని షిప్‌యార్డ్‌ వద్ద ఈ జలాంతర్గామి ని చైనా నిలిపింది.జూన్‌ చిత్రాల్లో మాత్రం ఆ సబ్‌ మెరైన్‌ మళ్లీ తీరం వద్దకు తిరిగి రాలేదు.

ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఝౌ క్లాస్‌ లోని తొలి జలాంతర్గామి తీరం సమీపంలో మునిగిపోయిందనే విషయాన్ని దాచిపెట్టేందుకు పీఎల్‌ నే ప్రయత్నిస్తోందని యూఎస్‌ రక్షణ శాఖ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు