లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా ఆగడం లేదు. దీని ప్రభావం వల్ల మృతుల సంఖ్య 16కు చేరింది. ఎటోన్ ఫైర్ ప్రాంతంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మరోవైపు గాలులు వేగంగా వీస్తున్నాయి. దీనివల్ల మంటలు ఒకచోట నుంచి మరోచోటుకి వేగంగా వ్యాపిస్తున్నాయి. పాలిసేడ్స్ ఫైర్‌ను 11 శాతం అదుపు చేశామని అధికారులు చెబుతున్నారు. అలాగే మంటలు బ్రెంట్‌వుడ్ వైపు మళ్లినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఆర్నాల్డ్, లిబ్రోన్ జేమ్స్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లాంటి వారి ఇళ్లు కూడా ఉన్నాయి. ఎటోన్ ఫైర్‌లో మాత్రం మంటలు ఇంకా అదుపు కాలేదు.
As someone who used to live in #LosAngeles, the wild fires have definitely got worse. There are now 3 separate fires out of control.
— James J. Marlow (@James_J_Marlow) January 8, 2025
Below is a beautiful house with two men and a dog trapped inside, surrounded by raging fire out of control, as smoke and poison fumes enter. pic.twitter.com/RUArQK1JB8
Also Read: సైనిక్ స్కూల్ 2025 ఎంట్రన్స్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ ఇదే.. వెంటనే అప్లై చేయండి
మంటల్లో ప్రియాంక చోప్రా ఇల్లు
మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్ ఏంజెలెస్‌లోనే ఉంది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటిదగ్గరకు వచ్చేసింది. ఇటీవలే ఆమె తన ఇంటికి సమీపంలో వ్యాపిస్తున్న మంటలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసి నాలుగు రోజులయ్యింది. ఈలోపే అక్కడ మంటలు వ్యాప్తి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటి వద్దకు వచ్చేసింది. మంటలను ఆపేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే పలువురు హాలివుడ్ సెలబ్రిటీల ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి.
The wildfires have reduced Palisades Village and Pacific Palisades in Los Angeles to a long line of building shells, twisted metal, ashes and debris https://t.co/7Kqv43LKwW pic.twitter.com/ivQJTVPuj5
— Reuters (@Reuters) January 11, 2025
ప్రస్తుతం లాస్‌ఏంజెలెస్ మంటలను ఆర్పడం పెద్ద సవాలుగా మారింది. తగలబడిపోతున్న వేలాది ఇళ్లను కాపాడేందుకు నీటి కొరత ఏర్పడుతోంది. అయితే ఈ హలీవుడ్ స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ రేట్లు అదనంగా వాడుకొని తమ గార్డెన్లు పెంచుతున్నట్లు ఓ వార్తా కథనం తెలిపింది. 2022 నుంచి లాస్ ఏంజెలెస్‌లో నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఎవరైనా తమ గార్డెన్లకు నీరు పెట్టుకోవాలంటే వారానికి రెండుసార్లు 8 నిమిషాల పాటే వాడుకోవాలి. కానీ కొందరు కేటాయించిన నీరు కంటే అదనంగా వాడినట్లు అధికారులు గుర్తించారు.
#BREAKING: Animation shows how the Palisades Wildfire has progressed through Los Angeles.
— Sujon Ahmed 🇺🇸 (@SAexploring) January 12, 2025
It’s still going and there are other wildfires burning too.
Gavin Newsom is responsible and must resign.#LosAngelesFires #LosAngeles #California #PalisadeFire pic.twitter.com/SRWu7hFThq
Also Read: మిలియన్ డాలర్ల లగ్జరీ బిల్డింగ్..బుగ్గిపాలు
మరోవైపు ఈ కార్చిచ్చు వెనుక కుట్రలు కూడా జరిగినట్లు వాదనలు వస్తున్నాయి. పప్ ఫిష్ అనే అరుదైన జాతి చేపలను రక్షించేందుకు కొన్నేళ్ల నుంచి కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించున్నట్లు తెలుస్తోంది. ఈ చేపల కోసం దక్షిణ కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించడం వల్లే ఇంతటి భారీ స్థాయిలో నష్టం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ సైతం ఆరోపిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Los Angeles Wildfire: Death Toll Rises, Homes Ransacked As California In Shambles | Horror In Visuals #TNDIGITALVIDEOS #LosAngeles #Wildfire pic.twitter.com/LuVrr6x7bL
— TIMES NOW (@TimesNow) January 12, 2025