మాజీ బాయ్‌ఫ్రెండ్ హత్య కేసులో.. బాలీవుడ్ నటి సోదరి అరెస్టు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియాను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. జంటహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను న్యూయార్క్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గత నెల మాజీ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని అలియా సజీవదహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. By Seetha Ram 03 Dec 2024 in ఇంటర్నేషనల్ సినిమా New Update షేర్ చేయండి గత నెలలో తన మాజీ బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ సజీవదహనం చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో అలియానే ప్రధాన నిందితురాలిగా తేలింది. దీంతో అలియాను అమెరికాలోని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..! ఏం జరిగింది..? బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ, అలియా ఫక్రీ సోదరీమణులు. నర్గీస్ ఫక్రీ సినిమాలలో బిజీ బిజీగా ఉంది. అదే సమయంలో అలియా ఫక్రీ అమెరికాలో ఉంటోంది. అక్కడే న్యూయార్క్‌లో అలియా.. ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఏడాది క్రితం వీరిద్దరూ విడిపోయారు. Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్ అనంతరం ఎడ్వర్డ్ జాకోబ్, అనాస్టాసియా ఎటినీ అనే యువతి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ సన్నిహితంగా తిరగడం మొదలు పెట్టారు. అది తెలిసి అలియా తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో మాజీ బాయ్ ఫ్రెండ్‌పై బెదిరింపులకు పాల్పడింది. ఇక జాకోబ్ ఎంతకీ వినకపోవడంతో అలియా దారుణానికి ఒడుగట్టింది. Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్.. నవంబర్ 2న జాకోబ్ అండ్ అనాస్టాసియా ఎటినీ కలిసి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి నిపంటించింది. ఇక ఇళ్లు మొత్తం కాలుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టు పక్కల ఉన్న స్థానికులు వారిని అప్రమత్తం చేశారు. కానీ అప్పటికే మంటలు విపరీతంగా చెలరేగంతో వారిద్దరూ అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు! ఇక ఈ తతంగాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అలియాను ప్రధాన నిందితురాలిగా గుర్తించి తాజాగా అరెస్టు్ చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవితఖైదు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అలియా ఫక్రీని రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేశారు. #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి