Benjamin Netanyahu: ముగింపు కాదు.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాను హెచ్చరించారు. యహ్యా సిన్వర్‌ మరణం ముగింపు కాదని.. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాలో బంధీలుగా ఉన్నవారిని వదిలిపెడితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని నెతన్యాహు పేర్కొన్నారు.

New Update
Benjamin Nethanyu

హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ అధినేత అయిన యహ్యా సిన్వర్‌ను ఇటీవల ఇజ్రాయెల్ హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాతో యుద్ధం ముగింపు కాదు..ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్నారు. హమాస్‌లోని సభ్యులు లొంగిపోవాలని, వారి దగ్గర ఉన్న బందీలని వదిలేస్తేనే సిన్వర్‌ మరణంతో యుద్ధానికి ముగింపు పలుకుతామని నెతన్యాహు గాజాను హెచ్చరించారు. గాజాలో బందీలుగా ఉన్న మా పౌరులు అందరూ తిరిగి వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని నెతన్యాహు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

డీఎన్‌ఏ ఆధారంగా..

ఐడీఎఫ్ దళాల చేతిలో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందాడని ఇటీవల ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తెలిపారు. అయితే గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందులో కమాండర్ సెంటర్ పూర్తిగా దెబ్బతింది. ఇందులోనే హమాస్ ఛీప్​ యహ్యా సిన్వార్ మృతి చెందారని తెలిపింది. అయితే ఆ దాడుల్లో ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారని ఐడీఎఫ్ ప్రకటించింది. ఆ తర్వాత డీఎన్ఏ పరీక్షల తర్వాత యహ్యా చనిపోయడని తెలిపింది. అయితే ఈ విషయాన్ని కేవలం ఇజ్రాయెల్ మాత్రమే స్పష్టం చేసింది. దీనిపై హమాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇది కూడా చూడండి: Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న దాడి చేశారు. ఈ ఘటనలో హమాస్‌ తీవ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్‌ ప్రజలను చంపారు. అప్పటి నుంచి సిన్వార్‌ కోసం ఇజ్రాయెల్‌ వేట మొదలుపెట్టింది. యాహ్యా అసలు పేరు యహ్యా ఇబ్రహీం హస్సన్‌ సిన్వార్‌. ఇతను 1962లో గాజాలోని ఖాన్‌ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో పుట్టాడు. సిన్వార్ పూర్వీకులు 1948 వరకూ ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌లో ఉండేవారు. ఆ తర్వాత సిన్వార్‌ కుటుంబం గాజాకు వెళ్లిపోయింది.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

ఇక యహ్యా గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్‌ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. సిన్వార్‌20 ఏళ్ళ పాటూ పాటు జైల్లో గడిపాడు. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరం మీ మొదటిసారి అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై.. మరొకరితో కలిసి మజ్ద్‌ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ హమాస్ లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ.. ఇజ్రాయెల్ తో బంధాలు పెట్టుకొన్నవారిని హత్య చేసినట్లు మజ్ద్‌ అభియోగాలు ఎదుర్కొంది. ఆ ఆరోపణలతోనే 1988లో అరెస్ట్‌ కాగా.. 1989లో యహ్యాకు జీవిత ఖైదు విధించారు. 

ఇది కూడా చూడండి: Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

Advertisment
Advertisment
తాజా కథనాలు