/rtv/media/media_files/2026/03/13/iran-2026-03-13-15-25-52.jpg)
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన చేసింది. దివంగత ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజస్తే బగెర్జాదే బతికే ఉన్నారని చెప్పంది. ఆమె చనిపోయినట్లుగా వస్తున్న వార్తలను తప్పు అంటూ ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జిసి అనుబంధ ఫార్స్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ కూడా తన మొదటి ప్రకటనలో తన తల్లి మరణం గురించి ఎలాంటి ప్రస్తావన తేకపోవడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.
యుద్ధం ప్రారంభంలో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ తరువాత ఆయన భార్య కూడా మరణించరంటూ వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున జరిగిన దాడుల్లో అలీ ఖమేనీతో పాటు, అతని కోడలు, అల్లుడు, కుమార్తె, మనవడు సహా అతని కుటుంబ సభ్యులు కూడా మరణించారంటూ అక్కడి మీడియా స్వయంగా ప్రకటించింది.
మోజ్తాబా సంచలన కామెంట్స్
ఇదిలావుండగా.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తన ప్రసంగంలో సంచలన కామెంట్స్ చేశారు. ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇరానియన్ల మరణాలకు, ముఖ్యంగా మినాబ్ పాఠశాలపై జరిగిన దాడుల్లో చనిపోయిన చిన్నారుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. శత్రువులపై ఒత్తిడి పెంచడానికి హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచ ఇంధన సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. ఇరాన్ నౌకాదళంతో సమన్వయం చేసుకుంటేనే కొన్ని నౌకలను అనుమతిస్తామని చెప్పారు.ఫిబ్రవరి 28కి ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. హోర్ముజ్ జలసంధి భద్రత ఎంత కీలకమో ఇప్పుడు ప్రపంచానికి అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు.
Follow Us