USA: మిల్టన్ దెబ్బకు కొట్టుకుపోయిన ఫ్లోరిడా తీర ప్రాంతాలు భయంకరమైన మిల్టన్ తుఫాను ఫ్లోరిడా తీరప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలుల, వర్షంతో ముంచెత్తింది. టోర్నడోల దెబ్బకు 8 మంది మరణించారు. 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. By Manogna alamuru 11 Oct 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Milton Hurrican: అనుకున్నట్టుగానే మిల్టన్ తుఫాను అమెరికాను అల్లకల్లోలం చేసింది. టోర్నడోలు సెయింట్ లూసీ కౌంటీని అతలాకుతలం చేశాయి. ఐదుగురు ప్రాణాలు పొట్టనుపెట్టుకున్నాయి. ఇక ఫ్లోరిడాలో సాగర తీరలో ఉన్న నగరాలన్ని తుఫాను ధాటికి విపరీతంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో 30 లక్షల మంది అంధకారంలో కూరుకుపోయారు. ఎటుచూసినా నీరుతో ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి తుపాను తీరం దాటింది. కానీ ఇంకా ముప్పు పొంచే ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. Hampton Inn Panama City pic.twitter.com/xpxnF9fcba — Mark Sudduth (@hurricanetrack) October 10, 2018 We love you, St. Pete. It’s been a tough few weeks, but we’re still with you - we’re ready to recover and rebuild.City crews began accessing damage at daybreak and were encouraging all residents to stay off the roads until we deem it safe.#WeAreStPete pic.twitter.com/yIobPVLq2E — St. Petersburg, FL (@StPeteFL) October 10, 2024 ఫ్లోరిడాలోని తాంపాలో గంటకు 205 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచాయి. భారీ వర్షం కురిసింది. చాలా ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. ఫోర్ట్ మైయర్స్ లో టోర్నడాల దెబ్బకు చెట్లు కూలిపోయాయి. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీ, ఇంకా చాలా ప్రాంతాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. తుపాను ధాటికి చాలా మందే చనిపోయుంటారని...ఎంత నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని అక్కడి అధికారులు అంటున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్లో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల దెబ్బకు ఇళ్ళ పై కప్పులు లేచిపోయాయి. మంచి నీటి సరఫరా ఆగిపయింది. లోఇడాలో విమానాశ్రయాలు మూతబడ్డాయి. హెలెన్ హరికేన్ వేంటనే మిల్టన్ వరుసగా ఫ్లోరిడాను దెబ్బతీశాయి. ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని...ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by CBS News (@cbsnews) Hurricane Milton very close to making landfall! This video is from my friend Rob in Fort Myers, FL. They are expected to have 8-12 feet storm surge overnight. Yikes! 😳 pic.twitter.com/lOWljOzxS6 — Danielle Breezy (@DanielleBreezy) October 10, 2024 Also Read: హెజ్బుల్లా అంతమే టార్గెట్..ఇజ్రాయెల్ నెక్ట్స్ లేపేసేది అతడినే మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి