Iran-US War: ఒక్క తూటా పేలకుండా అమెరికా ఆట కట్.. ఇరాన్ కు చైనా ప్రొఫెసర్ సలహా ఇదే!

అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఒంటరిగానే పోరాడుతున్న ఇరాన్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోంది. కేవలం క్షిపణులు, తుపాకులతోనే కాకుండా తెలివితేటలతో యుద్ధం చేయవచ్చని ఒక చైనా ప్రొఫెసర్ ఇరాన్‌కు అదిరిపోయే సలహా ఇచ్చారు.

New Update
china

అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఒంటరిగానే పోరాడుతున్న ఇరాన్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోంది. కేవలం క్షిపణులు, తుపాకులతోనే కాకుండా తెలివితేటలతో యుద్ధం చేయవచ్చని ఒక చైనా ప్రొఫెసర్ ఇరాన్‌కు అదిరిపోయే సలహా ఇచ్చారు. ఇరాన్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా అమెరికా కూటమిని గడగడలాడించవచ్చని ఆయన విశ్లేషించారు. గల్ఫ్ దేశాల అతిపెద్ద బలహీనతను ఆసరాగా చేసుకుని ఇరాన్ చెక్ పెట్టవచ్చని ఆయన చెబుతున్న మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మంచినీటి వనరులు దాదాపు సున్నా

సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలకు ప్రకృతి సిద్ధంగా లభించే మంచినీటి వనరులు దాదాపు సున్నా అని ఆ ప్రొఫెసర్ గుర్తు చేశారు. ఈ దేశాల్లో ప్రజలు తాగే నీటిలో 60 శాతానికి పైగా సముద్రపు ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చే డిశాలినేషన్ ప్లాంట్ల నుండే వస్తుంది. ఈ దేశాలు భారీ యంత్రాలు, ప్లాంట్లపైనే పూర్తిగా ఆధారపడి బతుకుతున్నాయి. ఒకవేళ ఈ ప్లాంట్లు పని చేయడం ఆగిపోతే, కేవలం కొన్ని గంటల్లోనే అక్కడ నీటి కోసం అల్లర్లు మొదలవుతాయని, ఇది ఆ దేశాల ఉనికికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.

ఇరాన్ తన దగ్గరున్న అధునాతన డ్రోన్ సాంకేతికతతో ఈ నీటి ప్లాంట్లపై చిన్నపాటి దాడులు చేసినా చాలని ఆ ప్రొఫెసర్ విశ్లేషించారు. ఒకే ఒక్క సూసైడ్ డ్రోన్ వెళ్లి ప్రధాన నీటి ప్లాంట్‌ను ఢీకొంటే, లక్షలాది మందికి నీటి సరఫరా నిలిచిపోతుంది. గల్ఫ్ దేశాల్లో తినే ఆహారంలో 80 శాతం బయటి దేశాల నుండే వస్తుంది, ఇది కూడా నీటి సరఫరా, సప్లై చైన్ పైనే ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే వంట వండటం కూడా అసాధ్యమవుతుంది. ఇది సంప్రదాయ యుద్ధం కంటే భయంకరంగా మారి, ప్రజలందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనికులు కూడా స్థానికంగా దొరికే ఈ నీటిపైనే ఆధారపడతారని చైనా ప్రొఫెసర్ వివరించారు. అక్కడ నీటి సరఫరా దెబ్బతిని ప్రజలంతా అల్లాడుతుంటే, అమెరికా సైన్యం తన భద్రత కంటే ప్రజలకు నీరు అందించే పనిలోనే నిమగ్నమవ్వాల్సి వస్తుంది. దీనివల్ల వారి మేనేజ్‌మెంట్ మొత్తం ఫెయిల్ అయ్యి, అమెరికా కూడా మోకాళ్లపైకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ డిశాలినేషన్ ప్లాంట్లు అన్నీ సముద్ర తీరంలోనే ఉంటాయి. వీటిని కాపాడుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఇరాన్ డ్రోన్లు వీటిని లక్ష్యం చేసుకుంటే, ఆ యంత్రాలను బాగు చేయడానికి నెలల సమయం పడుతుంది. ఈలోపు పరిస్థితి చేయి దాటిపోతుందని, ఇదే గల్ఫ్ దేశాల అతిపెద్ద బలహీనత అని ఆయన తన విశ్లేషణలో తేల్చి చెప్పారు.

Advertisment
తాజా కథనాలు