/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-07-37-02.jpg)
Ukraine drone attack
Russia Oil Fire : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(ukraine russia war) కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యాలోని మరో ముఖ్యమైన ఆయిల్ ఫెసిలిటీ భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులే ఈ ప్రమాదానికి కారణం. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ జ్వాలలు ఏమాత్రం తగ్గడం లేదు. పరస్పర దాడులతో ఇరు దేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తన డ్రోన్ శక్తిని చాటుకుంటూ రష్యాలోని అత్యంత కీలకమైన ఇంధన వనరులపై విరుచుకుపడింది. ఉక్రెయిన్ సరిహద్దుకు సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాలోని పెర్మ్ ప్రాంతంలోని ఆయిల్ పంపింగ్ స్టేషన్‌ను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా ఢీకొట్టాయి.
A report by Major General Yevhenii Khmara on our long-range sanctions – a new stage in the use of Ukrainian weapons to limit the potential of Russia’s war. I am grateful to the guys from the Security Service of Ukraine for their precision.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 29, 2026
The straight-line distance is over… pic.twitter.com/8wFRJ6cE8R
Also Read : మేం లేకుంటే మీరు ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేది... ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్
Russia vs Ukraine War
ఉక్రెయిన్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యంపై జరిపిన డ్రోన్ దాడి అని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. దాడి అనంతరం ఆ ప్రాంతంలో భారీగా ఎగిసిపడుతున్న నల్లటి పొగకు సంబంధించిన వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. రష్యా ఆయిల్ పంపిణీ వ్యవస్థలో ఈ స్టేషన్ అత్యంత కీలకం కావడంతో, ఈ అగ్నిప్రమాదం రష్యా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు మరియు పోర్టులను లక్ష్యంగా చేసుకుంటోంది. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్‌లోని పౌర ప్రాంతాలపై దాడులను తీవ్రం చేసింది. ఈశాన్య ఖర్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో 8 మంది గాయపడగా, సుమీ ప్రాంతంలో 60 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారీ సంఖ్యలో డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని రష్యా అధికారులు పేర్కొన్నప్పటికీ, పెర్మ్ చమురు కేంద్రంపై జరిగిన దాడి గురించి ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Also Read : అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో... విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం
Follow Us