అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు.. ఎండాకాలంలో ఎదిగినవాడు అనే ఓ సామెత ఉండే.. అయితే ఇప్పుడు కాలిఫోర్నియాలో దీనికంతా రివర్స్‌లో జరుగుతోంది. టైం కాని టైంలో కార్చిచ్చు కమ్మేస్తోంది. అమెరికాలో ప్రస్తుతం చలికాలం.. అయినా సరే దక్షిణ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో అగ్నిదేవుడు తాండవం చేస్తున్నాడు. ఓ పక్క మంచు తుఫాను, మరో పక్క వేల ఎకరాల అడవులు దహనం అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. ఓ వైపు మంచు తుఫాను.. మరో వైపు కార్చిచ్చు అమెరికా దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు, మధ్య అమెరికాలోని ప్రాంతాల్లో మైనస్ 18 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఎయిర్ పోర్ట్ సర్వీసులు రద్దయ్యాయి. ఇదిలా ఉండగా.. మరోపక్క అగ్నిదేవుడి కోపానికి హాలివుడ్ భస్మమైంతోంది. ఆరు రోజులుగా 40వేల ఎకరాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. లాస్ ఏంజస్‌లో పెద్ద ఎత్తున ప్రాపర్టీ లాస్.. అది ఎంత ఖరీదైన కార్చిచ్చు అంటే.. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో బూడిదైన ఆస్తి విలువ.. ఇండియా బీహార్, యూపీ, ఢిల్లీ మూడు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం. 12 వేల భవనాలు కాలి బూడిద ఇక ప్రాణ నష్టం విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 2 లక్షల మంది నిరాశ్రయులైనారు, 1.5 లక్షల మంది ఎప్పుడైనా సరే తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లాల్సిన రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్నారు. 12 వేల భవనాలు కాలి బూడిదైయ్యాయి. సాధారణంగా కార్చిచ్చు వేసవిలో సంభవిస్తుంటాయి. మరి కాలంకాని కాలంలో కాలిఫోర్నియాని దహించిన ఈ కార్చిచ్చుకు కారణమేంటి? అసలు ధనవంతులంతా లాస్ ఏంజిల్స్‌లోనే ఎందుకు ఉంటున్నారని ఇప్పుడు చూద్దాం.. కాలిఫోర్నియా కార్చిచ్చులో నష్టమెంత? అమెరికాలోని వివిధ ఏజెన్సీల డేటా ప్రకారం.. 2025 జనవరి 6 నుంచి లాస్ ఏంజిల్స్‌ని దహిస్తున్న కార్చిచ్చు అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అగ్ని ప్రమాదం కావచ్చని చెబుతున్నాయి. వైల్డ్ ఫైర్ కారణంగా 135 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్లు అంటే సుమారు 11-13 లక్షల కోట్ల నష్టం సంభవించింది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో యుపి, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ బడ్జెట్‌తో సమానం. యూపీ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు, బీహార్ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉంది. ఢిల్లీ బడ్జెట్ చూస్తే రూ.76 వేల కోట్లు. 4 రాష్ట్రాల బడ్జెట్ అంత ఆస్తినష్టం లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదంలో చవిచూస్తుందని అంచనా. 6 ప్రాంతాల్లో కకావికలం లాస్ ఏంజిల్స్ 6 ప్రాంతాలలో కార్చిచ్చు కకావికళం చేస్తోంది. పాలిసాడ్స్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 21 వేల ఎకరాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. హర్స్ట్‌లో 775, ఈటన్‌లో 14 వేల ఎకరాలు తగలబడిపోయింది. లిడియా, కెన్నెత్, ఆర్చర్ ప్రాంతాలలో కూడా విధ్వంసం జరిగింది. మీడోలార్క్, గ్రెనడా హిల్స్ ప్రాంతాల వైపు మంటలు ఎగిసిపడ్డాయి. అంతకుముందు, సన్‌సెట్, వుడ్లీ, ఒలివాజ్‌లలో మంటలు అదుపులోకి వచ్చాయి. కారణమేంటి? బలమైన గాలులు, పొడి వాతావరణమే ఈ కార్చిచ్చుకు కారణమని విచారణలో తెలుస్తోంది. ఈ భయంకరమైన అగ్నిప్రమాదానికి వాతావరణ మార్పులే కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సుదీర్ఘమైన కరువుతోపాటు పొడి వాతావరణమే ప్రధాన కారణమట. కొన్ని నెలలుగా కాలిఫోర్నియాలో వానలు పడట్లేదు. దక్షిణ కాలిఫోర్నియాలో మే నుంచి అక్టోబర్ వరకు సమ్మర్. ఏడాది పొడవునా హీట్, భారీ ఉష్ణగ్రతలు ఉంటాయి. ఓ అంచనా ప్రకారం.. 1990 నుంచి ప్రపంచంలో 42 లక్షల చదరపు కిలోమీటర్ల అడవులు కార్చిచ్చుకు బలైయ్యాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు అడ్డాలు. కాలిఫోర్నియాలో అడవులను నరికి ప్రజలు స్థిరపడ్డారు. అందుకే ఈ వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్నికి ఆజ్యంగా శాంతా అనా వడగాలులు అగ్నికి ఆజ్యం తోడైనట్లు కార్చిచ్చుకు శాంతా అనా అనే వడగాలులు కూడా ఓ రిజన్‌గా చెప్పవచ్చు. ఈ గాలులు 95-135 కి.మీ వేగంతో భూమి నుంచి తీరం వైపు వీస్తాయి. గ్రేట్ బేసిన్‌పై అధిక పీడనం ఏర్పడినప్పుడు, కాలిఫోర్నియా తీరంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు శాంటా అనా గాలులు సంభవిస్తాయి. కొన్నిసార్లు గంటకు 165 కి.మీ స్పీడ్‌తో కూడా శాంతా అనా పవనాలు వీస్తాయి. శాంతా అనా వచ్చినప్పుడు చిన్న కార్చిచ్చు అయినా అది భారీ వినాశనానికి దారి తీస్తోంది. వాస్తవానికి మే నుంచి అక్టోబర్ నెలల్లో దక్షిణ కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చులు సంభిస్తాయి. అనుమానాలు టైం కాని టైంలో ఇంత పెద్ద ఎత్తున చెలరేగిన కార్చిచ్చు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాస్ ఏంజిల్స్ ప్రకృతి విపత్తు ఫేస్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంటలను ఆర్పడానికి నీటి కొరత ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కానిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా గెలిచిందేమో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. మాజీ ప్రెసిడెండ్ జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ కూడా లాస్ ఎంజిల్స్‌లోనే ఉంటారు. ఆ ఏరియాను పొలిటికల్‌గా ట్రంప్ టార్గెట్ చేశాడని విమర్శలొస్తున్నాయ్. అగ్ని ప్రమాదం ఎప్పుడైనా సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నా.. గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకోలేదట. విపత్తు నివారణ చర్యలు చేపట్టలేదని కొందరు అంటున్నారు. గతంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు 1898లో నార్త్ కరోలినా, సౌత్ కరోలినా అగ్ని ప్రమాదంలో 3 లక్షల ఎకరాల భూమి దహనమైంది. 1910లో అమెరికాలోని మోంటానాలో కార్చిచ్చు సంభవించింది. 30 లక్షల ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. 87 మంది ప్రాణాలు కోల్పోయారు. 1940లోనే అలస్కాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 లక్షల ఎకరాల భూమి నాశనమైంది. దీనిని రబీ ఫైర్ అని పిలుస్తారు. 2004 అలస్కాలో 13 లక్షల ఎకరాల భూమి కాలిపోయింది. 2018లో కూడా కాలిఫోర్నియాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో కోట్ల విలువైన ఆస్తిని నాశనమైంది. 2020లో మళ్లీ కాలిఫోర్నియాలో కార్చిచ్చు చోటుచేసుకుంది. 10 లక్షల ఎకరాలకు పైగా అటవి భూమి ప్రభావితమైంది. 2024 ఫిబ్రవరిలో టెక్సాస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మిలియన్ ఎకరాలకు పైగా భూమి దెబ్బతిన్నది. దీనిని స్మోక్‌హౌస్ క్రీక్ ఫైర్ పేరు పెట్టారు. 2018లో కాలిఫోర్నియాలోని వూల్సే ప్రాంతంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో 10 వేల ఎకరాలు మంటల్లో దగ్ధమైయ్యాయి. ఇది అటవీ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థను నాశనం చేసింది. చాలా మొక్కలు ధ్వంసమయ్యాయి. సింహాల సంఖ్య తగ్గింది. చాలా జంతువులు ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయ్యాయి. ఇలాంటి కార్చిచ్చును పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ సినీ ప్రముఖులు, ధనంతుల అడ్డా..?