Iran US War : వ్యూహం మార్చిన అమెరికా ..... దిమ్మ తిరిగే ప్లాన్ వేసిన ట్రంప్

అమెరికా ,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే లక్ష్యంతో అమెరికా 'ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ' అనే పదునైన వ్యూహాన్ని అమలు చేస్తోంది.

New Update
Donald Trump

Donald Trump

Iran US War : అమెరికా ,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే లక్ష్యంతో అమెరికా 'ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ' అనే పదునైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇప్పటికే ఇరాన్ పోర్టుల వద్ద సముద్ర దిగ్బంధనం విధించడంతో, ఆ దేశం రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల మేర నష్టపోతోంది. తాజాగా ఇరాన్ విమానయాన రంగాన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా, ఇరాన్ ఎయిర్ మరియు మహాన్ ఎయిర్ వంటి సంస్థలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, మెయింటెనెన్స్ వంటి సేవలు అందించే ఏ అంతర్జాతీయ కంపెనీపైనైనా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఇరాన్ ఎయిర్‌లైన్స్ ద్వారా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆయుధాలు, సిబ్బందిని తరలిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆర్థిక యుద్ధం అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల చైనా, టర్కీ, యూఏఈ దేశాలకు చెందిన అనేక షిప్పింగ్, రిఫైనరీ కంపెనీలు ఇప్పటికే అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరమయ్యాయి. ముఖ్యంగా చైనాకు చెందిన చమురు రవాణా నెట్‌వర్క్‌లు ఈ ఆంక్షల వల్ల భారీగా నష్టపోయాయి. మరోవైపు, హార్మూజ్ జలసంధిలో ఇరాన్ బలగాలు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపిన ఘటనల తర్వాత అమెరికా తన పట్టును మరింత బిగించింది. విమానయాన,ఇన్సూరెన్స్ రంగాల్లోని సంస్థలు ఇరాన్‌కు సహకరిస్తే అవి అమెరికా మార్కెట్లలో వ్యాపారం చేసే అవకాశాన్ని కోల్పోతాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధం ముగించి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి ఇరాన్‌కు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందని, లేనిపక్షంలో ఆ దేశ చమురు పైపులైన్లు పేలిపోతాయని హెచ్చరించారు. దిగ్బంధనం కారణంగా చమురు ఎగుమతులు నిలిచిపోతే, సాంకేతిక మరియు ప్రకృతి కారణాల వల్ల పైపులైన్ల వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఇంధనాన్ని నిల్వ చేయడానికి తగినన్ని నౌకలు లేదా కంటైనర్లు లేవని, ఆర్థికంగా ఆ దేశం పూర్తిగా బలహీనపడిందని ట్రంప్ పేర్కొన్నారు.

మొత్తంగా, 2025లో ప్రారంభమైన ఈ ఆర్థిక ఆంక్షల పర్వం ఇరాన్ ఆయుధ సంపత్తిని, డ్రోన్ల తయారీని, చమురు స్మగ్లింగ్‌ను అడ్డుకోవడమే పరమావధిగా సాగుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్,ఎరువుల సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విమానాలకు అవసరమైన కనీస సేవలను కూడా అందకుండా చేయడం ద్వారా ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుండి వేరు చేయాలని అమెరికా భావిస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను మరింత సాంద్రీకృతం చేయడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.


సేవలు నిషేధం:

జెట్ ఇంధనం సరఫరా
విమాన మెయింటెనెన్స్, రిపేర్
ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్
గ్రౌండ్ హ్యాండ్లింగ్
ల్యాండింగ్, ఎయిర్‌పోర్ట్ ఫీజులు
ప్రపంచ వ్యాపారాలు: విమానయాన, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లోని సంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.
ప్రాంతీయ ప్రభావం: హార్మూజ్‌ జలసంధి దిగ్భందనం వల్ల చమురు, గ్యాస్‌, ఎరువుల సరఫరా అంతరాయం.

Advertisment
తాజా కథనాలు