/rtv/media/media_files/2026/06/16/fotojet-5-2026-06-16-09-51-49.jpg)
రష్యాకు చెందిన యుద్ధ విమానం Tu-22M3 ప్రమాదవశాత్తు కుప్పకూలింది. సైబీరియా అనే ప్రాంతంలో పైలట్లకు ట్రైనింగ్ ఇస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో నలుగురు పైలట్లు బయటపడ్డారు. ఇది రష్యా సైన్యంలో చాలా పవర్‌ఫుల్ విమానం. శత్రువుల స్థావరాలను నాశనం చేయడానికి రష్యా దీనిని ఎక్కువగా వాడుతుంది. ముఖ్యంగా చాలా వేగంగా దూసుకెళ్లే 'కింజాల్' అనే శక్తివంతమైన క్షిపణులను తీసుకెళ్లడం ఈ విమానం స్పెషాలిటీ. గతంలో సిరియాలో జరిగిన యుద్ధంలోనూ, ఇప్పుడు ఉక్రెయిన్‌తో జరుగుతున్న గొడవల్లోనూ రష్యా ఈ విమానాలను బాగా ఉపయోగించింది.
🚨BREAKING: Russian Tu-22M3 strategic bomber crashed in Russia’s Irkutsk region during a training flight.
— Amitabh Chaudhary (@MithilaWaaala) June 16, 2026
According to Russian authorities, the crew safely ejected and survived. No damage was reported on the ground, the bomber was not carrying any weapons. pic.twitter.com/bfpn6z9gK6
ప్రమాదం జరిగిన సమయంలో ఈ విమానం కేవలం ట్రైనింగ్ కోసమే ఆకాశంలోకి వెళ్లింది. కామెంకా అనే ఒక చిన్న గ్రామానికి దగ్గరలో కూలినట్లు తెలుస్తోంది. అయితే విమానం ఇంజిన్ పాడైపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అదృష్టవశాత్తూ ట్రైనింగ్ సమయం కాబట్టి, ఆ విమానంలో ఎలాంటి బాంబులు గానీ, మిస్సైళ్లు గానీ లేవు. దీనివల్ల పెద్ద నష్టం తప్పింది. ఈ యుద్ధ విమానం మనుషులు ఎవరూ లేని ఒక అడవి ప్రాంతంలో పడిపోయింది. దీంతో ప్రాణ నష్టం తప్పింది.
Nagrania przedstawiające wczorajszą katastrofę rosyjskiego Tu-22M3 🇷🇺
— Krystian Pograniczny 🇵🇱 | Defence • Hydrology (@Krystian_Pogr) June 16, 2026
W okolicy Irkucka.
Maszyna miała przechodzi loty próbne po remoncie. No cóż... Nie poszło im najlepiej. Według pierwszych informacji piloci ewakuowali się z maszyny i przeżyli wypadek.
Źródło:… pic.twitter.com/XYyf8uGxBv
Follow Us