/rtv/media/media_files/2026/04/18/fotojet-14-2026-04-18-15-18-12.jpg)
Us Rejects High Number Of Indian Student Visa Applications
US Student Visa : అమెరికా విద్యార్థి వీసా తిరస్కరణల విషయంలో వివిధ దేశాల మధ్య. భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తాజా నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలో వీసా తిరస్కరణ రేటు అరవై ఒక్క శాతంగా నమోదైంది. పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో డెబ్బై ఒక్క శాతం దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. బంగ్లాదేశ్‌లో ఈ తిరస్కరణ రేటు డెబ్బై మూడు శాతానికి చేరుకుంది. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో అత్యధికంగా ఎనభై ఒక్క శాతం. ఈ దేశాల విద్యార్థుల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని తెలుస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇవి సూచిస్తున్నాయి. ప్రాంతీయ ప్రాతిపదికన వీసా జారీ ప్రక్రియలో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఇది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆసియా ఖండం వ్యాప్తంగా వీసా తిరస్కరణల ధోరణిని పరిశీలిస్తే. గత పదేళ్లలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2015 సంవత్సరంలో ఆసియాలో తిరస్కరణ రేటు ముప్పై శాతంగా ఉంది. 2020 నాటికి ఇది నలభై శాతం గరిష్ట స్థాయికి చేరింది. అయితే 2025 నాటికి అది స్వల్పంగా పెరిగి నలభై ఒకటి శాతం వద్ద స్థిరపడటం ఆసియా ప్రాంతంలోని తీవ్రతను తెలియజేస్తోంది. దశాబ్ద కాలంలో ఆసియా విద్యార్థుల వీసా ఆశలపై నీళ్లు చల్లబడ్డాయి. ఇతర పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా రేటు చాలా ఎక్కువ. ఇది విద్యార్థులలో ఆందోళన మరియు అభద్రతా భావాన్ని పెంచుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే మార్గం కష్టతరంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా వీసా తిరస్కరణల పరిస్థితిని ఒకసారి గమనిస్తే. అంతర్జాతీయ స్థాయిలో తిరస్కరణల రేటు పెరుగుతూనే ఉన్నట్లు అర్థమవుతోంది. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్త వీసా తిరస్కరణ రేటు ముప్పై ఒకటి. కానీ 2025 నాటికి అది ముప్పై ఐదు శాతానికి పెరిగింది. గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధిక తిరస్కరణ రేటు అని. షోర్‌లైట్ నివేదికలోని అధికారిక సమాచారం స్పష్టంగా వెల్లడి చేయుచున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి వీసా తిరస్కరణ ఎదురవుతోంది. ఇది అంతర్జాతీయ విద్యారంగంలో ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల ప్రతిభ కంటే భౌగోళిక అంశాలే కీలకంగా మారుతున్నాయి. ఈ పరిణామం అమెరికా యూనివర్సిటీల ఆర్థిక వనరులపై ప్రభావం చూపుతోంది.
భారత స్టూడెంట్ల వీసా తిరస్కరణ ఇలా
2023- 36%
2024-53%
2025-61%
తగ్గుతున్న భారత్ విద్యార్థుల సంఖ్య
2025 ఫిబ్రవరి నాటికి అమెరికాలో 3,78,787 మంది భారతీయ విద్యార్థ్ధులు ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 3,52,644కు పడిపోయిందిజ
ఇతర దేశాల వీసాల తిరస్కరణ ఇలా
ఇండియా : 61%
పాకిస్థాన్ : 71%
బంగ్లాదేశ్ : 73%
నేపాల్ : 81%
ఆఫ్ఘనిస్తాన: 81%
ఇసియా ఖండంలో వీసాల తిరస్కరణ
2015: 30%
2020: 40%
2025: 41%
అంతర్జాతీయ స్థాయిలో
2024: 31%
2025: 35% (పది ఏండ్లల్లో )
Follow Us