Iran: అమెరికాతో ఢీ అంటే ఢీ..10 లక్షల మందితో ఇరాన్ సైన్యం

ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్న వేళ ఇరాన్‌ అప్రమత్తమైంది. అమెరికా దాడులకు ఏమాత్రం బయపడమని చెబుతూనే ఆ దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.

New Update
FotoJet (12)

iran army

Iran: అమెరికా, ఇజ్రాయెల్‌దాడులకు ఏమాత్రం వెరవని ఇరాన్‌ వాటికి ధీటుగా సమాధానం ఇస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్న వేళ ఇరాన్‌ అప్రమత్తమైంది. అమెరికా దాడులకు ఏమాత్రం బయపడమని చెబుతూనే ఆ దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యా్న్ని సిద్ధం చేస్తోంది. అ దేశ సైనికాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయన్ని వెల్లడించడం గమనార్వం.

ఇరాన్‌తో యుద్ధ విరమణకు చర్చలు సాగుతున్నాయంటూ చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోవైపు పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని విస్తరించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇరాన్‌  బసిజ్‌ ఫోర్స్‌, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (IRGC)తో పాటు ఇతర అన్ని  విభాగాలు తక్షణమే యుద్ధరంగంలోకి వచ్చేవిధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్‌ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇరాన్‌ భూభాగంలోకి అమెరికా (USA) సైన్యం అడుగుపెడితే.. వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు తమ యుద్ధ వీరులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాయి. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసిజ్‌ ఫోర్స్, ఐఆర్‌జీసీలకు చెందిన యువకులు పెద్దఎత్తున అభ్యర్థనలు పంపుతున్నట్లు వెల్లడించడం కలకం సృష్టిస్తోంది.

12 ఏళ్ల పిల్లలు కూడా..

ఇక ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో యుద్ధంలో పాల్గొనేందుకు అవసరమైన వయసును కూడా ఇరాన్‌ తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. దీని ప్రకారం12 ఏళ్ల పిల్లలను కూడా యుద్ధంలో పాల్గొనేందుకు ఇరాన్‌ అనుమతివ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దీనికి ‘ఫర్‌ ఇరాన్‌’ అని పేరు పెట్టినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. పెట్రోలింగ్‌, చెక్‌ పాయింట్ల దగ్గర వీరిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

ఓటమి భయంలో ఇజ్రాయెల్‌

ఇదిలాఉండగా.. ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు సైనికుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఉండాల్సిన దానికంటే 12వేల మంది సైనికుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు  సైనికాధికారులు ప్రభుత్వానికి వెల్లడించారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. సైనిక కొరత కారణంగా ఐడీఎఫ్‌ నిర్వియం అయ్యే ప్రమాదం ఉందని.. ఆ సంస్థ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌, లెఫ్టినెంట్‌ జనరల్ ఐయాల్‌ జమీర్‌ ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. అనుకున్న దానికంటే సైఊనికులు తక్కువగా ఉంటే ఇరాన్‌ ను ధీటుగా ఎదుర్కోలేమని ఇజ్రాయెల్‌ ఆందోళనలో ఉంది. దీనికి సంబంధించి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో సహా ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆయన లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

Advertisment
తాజా కథనాలు