/rtv/media/media_files/2025/02/11/791P64rSKzmwbz4dWKot.jpg)
bus accident
గ్వాటెమాలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు. బస్సు లోయలోకి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని అగ్నిమాపక అధికారి ఆస్కార్ సాంచెజ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 53 మృతదేహాలను వెలికితీశామని.. మరొక ఇద్దరు శాన్ జువాన్ డి డియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మృతిచెందారని అధికారులు తెలిపారు.
ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో. అంతేకాకుండా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఈ విపత్కర సంఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదానికి బాధ్యులైనవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బస్సు కలుషిత నీటిలో తలక్రిందులుగా దిగడంతో, సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది.
మెక్సికోలో ఘోర ప్రమాదం
మరోవైపు ఇటీవల దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడంతో.. 38 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు బస్సు డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారి వెల్లడించారు.
Also Read : ఏంటీ నిజమా.. రూ. 200 నోటును బ్యాన్ చేస్తున్నారా.. ఆర్బీఐ కీలక ప్రకటన!