సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులను తొందరగా గుర్తించడానికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సరికొత్త స్కానర్‌ను అభివృద్ధి చేశారు. పాత త్రీడీ ఫొటో అకౌస్టిక్‌ టొమోగ్రఫీతో పోలిస్తే కొత్త స్కానర్ సెనన్ల సమయంలో వ్యాధులను గుర్తించగలదని తెలిపారు.

New Update
heart attack

ఈరోజుల్లో ఎక్కువ శాతం ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధులను ముందుగానే గుర్తిస్తే కొంత వరకు సమస్యలను తగ్గించవచ్చు. ఈ వ్యాధులను ముందుగానే గుర్తించడానికి ఒక సరికొత్త స్కానర్‌ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

ఇది కూడా చూడండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

సెకన్ల సమయంలోనే..

కొన్ని సెకన్లలోనే త్రీడీ ఫొటో అకౌస్టిక్‌ టొమోగ్రఫీ (పీఏటీ) చిత్రాలను అందించి.. వ్యాధి బారిన పడ్డారో లేదో చెబుతుంది. ఈ స్కానర్ 3-5 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ పీఏటీ పరిజ్ఞానాన్ని 2000 సంవత్సరంలో అభివృద్ధి చేశారు. ఈ స్కానర్ ద్వారా మనుషుల కణజాలంలో 15 మిల్లీమీటర్ల లోతు లోపలి వరకు వెళ్లి రక్తనాళాలను పరిశీలిస్తుంది.

ఇది కూడా చూడండి: TS: గ్రూప్ –1 పై ప్రభుత్వం చర్చలు‌‌–కీలక ప్రకటన చేసే అవకాశం

 ఈ విధానం వల్ల పాత స్కానర్లతో పోలిస్తే 1000 రెట్లు వేగంగా వ్యాధులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పీఏటీ ఇమేజింగ్‌ వల్ల వృద్ధులకు తొందరగా ప్రయోజనం చేకూరుతుంది. తొందరగా వ్యాధుని గుర్తించడంతో ప్రమాదాల నుంచి కాస్త బయట పడవచ్చు. ఈ పీఏటీ స్కానర్‌తో ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, శరీరంలో ఉండే ఏవైనా వ్యాధులను ఈజీగా గుర్తించవచ్చు.

ఇది కూడా చూడండి: Andhra Pradesh: అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

పాత పీఏటీ స్కానర్ అయితే వీటిని గుర్తించడానికి కనీసం గంట సమయం తీసుకుంటుంది. కానీ కొత్త పీఏటీ స్కానర్‌తో నిమిషాల్లో వ్యాధులను గుర్తించవచ్చు. క్యాన్సర్లు, కణితుల్లో రక్తనాళాలు దట్టంగా ఉండటం వల్ల గుర్తించడం కష్టం. అదే కొత్త స్కానర్‌తో అయితే కణితిలోని రక్తనాళాలను పరిశీలించడం ఈజీ. ఇదే కానీ తొందరగా వస్త కాస్త వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు.

ఇది కూడా చూడండి: Waynad: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్

Advertisment
Advertisment
తాజా కథనాలు