/rtv/media/media_files/2026/02/28/indians-2026-02-28-17-18-16.jpg)
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం పసిప్రాణాలను బలి తీసుకుంటోంది. భీకర దాడుల్లో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక బాలికల పాఠశాలపై బాంబులు పడటంతో 24 మంది విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో ఇరాన్ భూభాగంపై నమోదైన మొదటి భారీ మరణాలు ఇవే కావడం గమనార్హం.
5 students killed at a girls' school in southern Iran in Israel-US strike, reports AP, citing Iran's state-run news agency IRNA
— Press Trust of India (@PTI_News) February 28, 2026
అమాయక విద్యార్థినులు ప్రాణాలు
మినాబ్ నగరంలో ఇరాన్ విప్లవ దళాలకు చెందిన బేస్ ఉండటంతో దాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులు పక్కనే ఉన్న స్కూలుపై పడ్డాయి. దీంతో అమాయక విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎదిరించి, తమ భవిష్యత్తును మార్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఆఫీసు ఉన్న ప్రాంతాల్లో కూడా బాంబులు పడ్డాయి. టెహ్రాన్ నగరం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ దాడులకు ప్రతికారంగా బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి ప్రారంభించింది. "మా దేశాన్ని కాపాడుకోవడానికి వెనకాడబోం" అని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇరాక్, యూఏఈ తమ విమాన దారులను మూసివేసాయి.
Follow Us