Nigeria: నైజర్ నదిలో పడవ బోల్తా..100 మంది మృతి నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నైజర్ నదిలో పడవ బోల్తా డింది. దీనిలో వంద మందికి పైగా గల్లంతయ్యారు వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 29 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. కోగి రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇందులో గల్లంతైనట్లు నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఇబ్రహీం తెలిపారు. పడవలో పట్టే చోటు లేకపోయినా ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్లు, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున కోగి రాష్ట్రం నుంచి నైజర్‌లో ఫుడ్ మార్కెట్‌కు వెళ్తుండగా ఈ పడవ ప్రమాదానికి గురైంది. గల్లంతైన వారిలో ఏడుగురు మృతి చెందారు. మిగతా వారిని రక్షించేందుకు స్థానిక డైవర్లు రంగంలోకి దిగారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Also Read: Gold and Silver: మళ్ళీ పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు... మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి