గల్లంతైన టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెరైన్ ఆచూకీ లభ్యం! అట్లాంటిక్ మహాసముద్రంలో మినీ జలాంతర్గామి గల్లంతైంది దీని జాడకోసం గాలింపు చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడిందనే చెప్పాలి. కెనడాకు చెందిన పెట్రోలింగ్ విమానం పీత్రీ.. నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని అమెరికా కోస్ట్‌గార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ శబ్దాలతో దానిని పూర్తిస్ధాయిలో గుర్తించవచ్చని ఈరోజుతో ఆక్సీజన్‌కు బ్రేక్ పడనుందని అధికారులు చెబుతున్నారు. By Shareef Pasha 21 Jun 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన ఓ మినీ జలాంతర్గామి గాలింపు చర్యల్లో కీలక ముందడుగు పడింది. కెనడాకు చెందిన పెట్రోలింగ్ విమానం పీత్రీ.. నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది. విమానంలోని సోనార్ వ్యవస్థ శబ్దాలు గుర్తించిన నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలను రీలొకేట్ చేశారు. గురువారం తెల్లవారుజాము నాటికి మాత్రమే జలాంతర్గామిలో సరిపడా ఆక్సీజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రక్షక దళాలు విరామం లేకుండా జలాంతర్గామి కోసం రేయింబవళ్లు గాలిస్తున్నాయి. సబ్‌మెరైన్ కోసం అమెరికా, కెనడా విశ్వప్రయత్నాలు టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి అట్లాంటిక్ సముద్రంలో గల్లంతైన టైటాన్ అనే మినీ జలాంతర్గామి ఆచూకీ గాలింపులో కీలక పరిణామం జరిగింది. కెనడాకు చెందిన పీ-3 నిఘా విమానం గాలింపు చర్యలు చేపడుతూ.. నీటి అడుగున శబ్దాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ పేర్కొంది. 8 రోజుల సాహస యాత్రలో భాగంగా టైటానిక్ శకలాలను చూసేందుకు బిలియనీర్లు హమీష్ హార్డింగ్, షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, మరో ఇద్దరు సముద్ర గర్భానికి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయాన సాగరంలో ప్రవేశించిన గంటా 45 నిమిషాల్లోనే సబ్‌మెరైన్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాన్ని గాలించేందుకు అమెరికా, కెనడాలు పెట్రోలింగ్ విమానాలు, నౌకలను రంగంలోకి దించాయి. దీని పూర్తిస్థాయిలో పరిరక్షించేందుకు ఇంకా కొంత సమయం పట్టేలా ఉండటంతో రక్షణ దళాలు వెతికే పనిలో పడ్డాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి