నలంద కాలేజీలో ఘోరం.. ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకిన విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలోని నలంద కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఈ కళాశాలలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుధ అనే యువతి బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. ఆమె ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ చెప్పినా పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 02 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Inter Student Suicide: ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలో (AP) సంచలనం రేపింది. ఎన్నో ఆశలతో తనను చదివిస్తున్న పేరెంట్స్ కు ఆ యువతి తీరని శోకం మిగిల్చింది. ఉన్నట్టుండి శుక్రవారం రాత్రి బిల్డింగ్ మీదనుంచి దూకి చనిపోవడంతో అక్కడున్న తోటి విద్యార్థులు, సిబ్బంది ఉలిక్కి పడ్డారు. అయితే ఆ అమ్మాయి చావుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. Also Read :AP Barrelakka: ఏపీలో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి సై.. వైరల్ వీడియో! ఈ మేరకు నలంద కాలేజీ (Nalanda College) విద్యార్థులు, సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు సొంతవూరు బొమ్మనహాళ్లు మండలం కలగల్ల గ్రామం. అనంతపురం నలంద కాలేజ్‌లో సుధ (Sudha) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి శుక్రవారం రాత్రి కింద దూకింది. ఈ విషయం గమనించిన సిబ్బంది వెంటనే ఆసత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సుధ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకినపుడు తీవ్రంగా గాయపడతారని, రక్తపు మరకలు ఎందుకు కనిపించలేదంటూ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సుధ గొంతు చుట్టూ గాయాలున్నాయని, ఇది ఆత్మహత్య కాదు ఎవరో తన బిడ్డను హత్య చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు. వెంటనే తమ కూతురు మరణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇక దీనిపై స్పందించిన కాలేజీ ప్రిన్సిపల్.. కాలేజీలో ఎలాంటి సమస్యలు లేవన్నారు. సుధ ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నట్లు వెల్లడించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. #suicide #sudha #nalanda-college మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి