AP: టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ కలకలం.. కేశినేని చిన్ని ఆరోపణలు! ఇంటిలిజెంట్ అధికారులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో జగన్ పిచ్చి పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. By srinivas 24 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada: ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు బయటపడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ నాయకుల ఫోన్లు సైతం ట్యాపింగ్ గు గురవుతున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఇంటిలిజెంట్ అధికారులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో జగన్ పిచ్చి పనులు.. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేశినేని చిన్ని.. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ విభాగం వైసీపీకి తొత్తులాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయం తట్టుకోలేక వైసీపీ సిగ్గుమాలిన పనులకు దిగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న టీడీపీ పార్టీ వర్క్ షాప్ జరుగుతున్నప్పుడు ఇంటిలిజెంట్ అధికారులు తన ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. రహస్యంగా మా పార్టీ కార్యక్రమంలోకి ప్రవేశించి ఫోన్లు టాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇంటిలిజెన్స్ విభాగం అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తున్నారు. ఓటమి భయంతో జగన్ పిచ్చి పిచ్చి పనులు చేయిస్తున్నారు. ఇంటిలిజెన్స్ డీజీ రామాంజనేయులు ఇదంతా చేస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తామని కేశినేని నాని హెచ్చరించారు. #phone-tapping #keshineni-chinni #ap-ycp-and-tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి