All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment