Bhadradri Kothagudem District: వైద్యుల నిర్లక్ష్యానికి బలైన పసికందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన ఆస్పత్రి సూపరిండెట్ పసికందు మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. By Karthik 29 Aug 2023 in క్రైం ఖమ్మం New Update షేర్ చేయండి Infant Died: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందింది. దీంతో గర్భిణీ బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన గర్భిణీ శిరీష డెలివరీ కోసం సోమవారం మాతా శిశు ఆస్పత్రికి వెళ్లింది. గర్భిణీకి సోమవారం రాత్రి ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఇద్దరు పిల్లలు జన్మించినట్లు, వారిలో ఒకరు బాబు, మరోకరు పాప ఉన్నట్లు తెలిపారు. తల్లి పిల్లల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత పసికందుకు వాంతులు, విరేచనాలు అవుతుండటంతో చిన్నారి బంధువులు డాక్టర్ వద్దకు వెళ్లగా.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఇంకా డాక్టర్ రాలేదని చెప్పారు. Your browser does not support the video tag. Your browser does not support the video tag. Your browser does not support the video tag. Your browser does not support the video tag. Your browser does not support the video tag. పాపకు ఆగకుండా దాదాపు మూడు గంటల పాటు వాంతులు, విరేచనాలు అయినట్లు గర్భిణీ బంధువులు తెలిపారు. అప్పటికీ డాక్టర్ ఆస్పత్రికి రాకపోవడంతో నర్సులు పాపను పరీక్షించి సిరప్ ఇచ్చారని, చిన్నారికి వాంతులు తగ్గుతాయని చెప్పినట్లు గర్భిణి బంధువులు తెలిపారు. నర్సులు సిరప్ ఇచ్చిన గంట తర్వాత పాప మళ్లీ వాంతులు చేసుకోవడంతో నర్స్ వచ్చి పాపను తీసుకెళ్లారని తెలిపారు. ఏం జరుగుతుందో అర్దం కాకపోవడంతో గర్భిణీ బంధువులు పాపను తీసుకెళ్లిన వార్డుకు వెళ్లి తమ పాపను తమకు ఇచ్చేయ్యాలని నిలదీసినట్లు తెలిపారు. Your browser does not support the video tag. Your browser does not support the video tag. Your browser does not support the video tag. దీంతో పసికందు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారన్నారు. దీంతో బాధితురాలి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్.. డ్యూటీలో ఉన్న డాక్టర్ రాకపోవడంపై ఆరా తీశారు. చిన్నారి మృతికి కారణమైన డాక్టర్, నర్స్, సహాయ సిబ్బందిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా స్టాఫ్‌లో ఉన్న ఇద్దరు ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగం నుంచి టర్మీనెట్ చేస్తున్నట్లు తెలిపారు. Also Read: స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి #doctor #bhadradri-kothagudem-district #suspension #mata-shishu-hospital #child-death #staff #infant-died-in-kothagudem #infant-died-due-to-negligence-bhadradri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి