Kenya : అవసరం ఉంటేనే బయటకు రండి.. కెన్యాలోని భారతీయులకు కేంద్రం సలహా!

దేశంలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.దీంతో కెన్యాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

New Update
Kenya : అవసరం ఉంటేనే బయటకు రండి.. కెన్యాలోని భారతీయులకు కేంద్రం సలహా!

Kenya : దేశంలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిరసనలు జరుగుతున్న క్రమంలో వాతావరణం (Weather) రోజురోజుకి హింసాత్మకంగా మారింది. దీంతో కెన్యాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక సూచన చేసింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది.

‘‘ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకుంటే బయటకు రావొద్దు. పరిస్థితులు చక్కబడే వరకు నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకండి’’ అని కెన్యాలోని భారత కాన్సులేట్ ‘ఎక్స్’ (X) వేదికగా తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కెన్యాలోని భారతీయులందరూ చాలా , జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక కెన్యాలో నివసిస్తున్న భారత పౌరులు స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పింది. ఇక అప్‌డేట్స్ కోసం భారత కాన్సులేట్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా (Social Media) హ్యాండిల్స్‌ను ఫాలో కావాలని పేర్కొంది.

పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. మంగళవారం కెన్యా పార్లమెంట్‌ను ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ఆందోళనకారులు చనిపోయారు.

Also read: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఏపీ ఐఏఎస్‌ అధికారి..తెలంగాణ నుంచి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు