Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి ఆ మూడు రైళ్లు బంద్.. మళ్లీ ఎప్పుడంటే.. మూడు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఇంటర్ సిటీ, శాతవాహన, కాకతీయ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. By Shiva.K 10 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Indian Railways: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రబాద్-విజయవాడ మధ్య నడిచే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ర్దదు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఇంటర్ సిటీ, శాతవాహన, కాకతీయ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగానే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. అధికారుల ప్రకటన ప్రకారం.. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్‌లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా డిసెంబర్ 10 నుంచి 18వ తేదీ వరకు గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లను ఆపేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా, డిసెంబర్ 5వ తేదీ నుంచే ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్, కాజీపేట-డోర్నకల్ పుష్‌పుల్ రైళ్లను రద్దు చేశారు అధికారులు. ఇక ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలును కేవలం గుంటూరు నుంచి కాజీపేట వరకే నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. Also Read: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు! పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి #indian-railways #south-central-railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి