Indian Railways : చుక్కలు చూపిస్తున్న ట్రైన్లు.. భారత రైల్వేకు అసలేమైంది? గత కొన్ని రోజులుగా రైళ్లంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏ రైలు రద్దు అవుతోందో? ఏ ట్రైన్ ఏ టైమ్ కు వస్తుందో? తెలియని దుస్థితి ఏర్పడింది. భారీగా ట్రైన్ సర్వీసుల రద్దు.. నిర్వహణ లోపమే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By Nikhil 26 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Indian Railway Budget 2024 : సాయంత్రం నాలుగు అవ్వగానే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (Satavahana Express) ఎక్కేందుకు సికింద్రాబాద్‌కు పోటేత్తే జనాలు ఎందరో..! ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, విజయవాడ వెళ్లే ఈ ట్రైన్‌ను నమ్ముకునే వారి సంఖ్య వేలలో ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ ట్రైన్‌ను ఉన్నట్టు ఉండి రద్దు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే కేవలం శాతవాహననే కాదు.. పేద, మద్య తరగతి ప్రజలు ఎక్కువగా డిపెండ్ అయిన ఎన్నో ట్రైన్స్ 2020 కరోనా (Corona) తర్వాత రద్దయ్యాయి. ఇది ఏదో నోటి మాట కాదు.. గణాంకాలు చెబుతున్న వాస్తవాలు.. రైల్వే బడ్జెట్ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం డబ్బులున్న వాళ్ల కోసమే రైల్వే బడ్జెట్ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. Cancellation & Diversion of Trains due to Non-Interlocking Works over Vijayawada Division @RailMinIndia @drmvijayawada pic.twitter.com/Yo2Hafircz — South Central Railway (@SCRailwayIndia) July 25, 2024 జనాభాలో 90 శాతం మంది ఇండియన్ రైల్వే (Indian Railways) లపై ఆధారపడి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది జనరల్, అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలోనే ప్రయాణిస్తారు. అయిన్నప్పటికీ బడ్జెట్ మాత్రం సంపన్నుల కోసమే పెట్టినట్టుగా కనిపిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ఖర్చులో ఎక్కువ భాగం బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, వందే భారత్ రైళ్లు, రెండు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌లకు కేటాయించారు. ఇవి ఎలైట్ ప్యాసెంజెర్లు ఎక్కువగా ప్రయాణించే రైళ్లు..! అతి సామన్య ప్రజలు ఎక్కువగా ప్యాసెంజీర్లలోనే ప్రయాణిస్తారు. Cancellation/Short Termination/Diversion of Trains due to NI Works over Central Railway @RailMinIndia pic.twitter.com/OVqGr03pcS — South Central Railway (@SCRailwayIndia) July 25, 2024 నిజానికి గత పదేళ్లలో ప్యాసింజర్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. 200కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 2,500కి పైగా సాధారణ ప్యాసింజర్ రైళ్లు, 450కి పైగా EMU రైళ్లు గత 10ఏళ్ల నుంచి నడవడం లేదు. దీని కారణంగా రైళ్లు ఓవర్ క్రౌడ్ అవుతున్నాయి. ఏ ట్రైన్ చూసినా విపరీత రద్దీ కనిపిస్తోంది. అటు రైళ్ల సగటు వేగాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరికొత్త వందే భారత్ రైళ్లు కూడా ప్రయాణ సమయాన్ని తగ్గించడంలేదు. ప్యాసెంజర్లు గంటకు సగటున 35కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ గంటకు సగటున 60కిలోమీటర్ల వేగం, వందే భారత రైళ్లు గంటకు 76కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇక గతంలో రైల్వేల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉండేది.. అయితే 2017 తర్వాత యూనియన్ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను కలిపేశారు. ఇది మూర్ఖపు నిర్ణయమని మెట్రో మ్యాన్ శ్రీధరన్ విమర్శించారు. ఇక 2023లో 278 మంది ప్రయాణికుల మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత ఈ నిర్ణయం తప్పు అని మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అంగీకరించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ రైల్వేను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేలా ఉన్నాయని మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఆరోపించారు. ఇటు ప్రస్తుతం ఎన్డీయే (NDA) మిత్రపక్షంగా ఉన్న మరో మాజీ రైల్వే మంత్రి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం గతంలో బీజేపీ నిర్ణయాలను తప్పబట్టారు. రైల్వే బడ్జెట్‌ను యూనియన్ బడ్జెట్‌లో విలీనం చేయడాన్ని ఆయన అంగీకరించలేదు. ఇక కనీస మెరుగైన ట్రాక్‌లను అభివృద్ధి చేయకుండా, సిగ్నలింగ్, భద్రతా పరికరాలను ఆధునీకరించకుండా బుల్లెట్ రైళ్లు, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం ఏంటో అర్థంకాని పరిస్థితి. ఎందుకంటే దేశంలో తరుచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2018-19 తర్వాత ఏడాదికి సగటున 40 రైళ్ల ప్రమద ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో చాలా వరకు రైలు పట్టాలు తప్పినవే ఉన్నాయి. సామాన్యుడి విమానంగా చెప్పుకునే ట్రైన్ సర్వీసులను తగ్గించడం.. సరిగా నిర్వహించపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుడికి తక్కువ ధరలో ప్రయాణించే అవకాశాన్ని దూరం చేస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రద్దు చేసిన రైళ్లను తిరిగి ప్రారంభించాలని, కొత్త సర్వీసులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read : ఐ అండ్ పీఆర్ ప్రకటనలపై రూ. 850 కోట్లు.. హౌస్ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్.! #indian-railways #satavahana-express మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి