BIS App: ఇంట్లోనే బంగారం క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు.. ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు! ప్రపంచం డిజిటల్ మయం అయ్యాక అంతా మారిపోయింది. అన్నీ మన చేతుల్లోకే వచ్చేశాయి. దేనికీ కష్టపడక్కర్లేకుండా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి బంగారు ఆభరణాలు కూడా వచ్చేశాయి. బంగారం స్వచ్ఛత తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికీ పరుగెట్టక్కర్లేదు అంటోంది భారత ప్రభుత్వం. మీ ఇంట్లోనే యాప్ ద్వారా దాన్ని చెక్ చేసుకోవచ్చని చెబుతోంది. By Manogna alamuru 24 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి బంగారం మనం కొన్నా...దుకాణం వాళ్ళు మన దగ్గర కొన్నా మొట్టమొదట చెక్ చేసేది స్వచ్ఛతనే. అది ఉంటేనే బంగారానికి వాల్యూ ఉంటుంది. ఎలాంటి నగలు కొన్ని స్వచ్ఛత విషయంలో రాజీ పడకూడదు. అయితే నగలు కొనడానికి వెళ్ళినప్పుడు దాని మీద ప్యూరిటీ రాస్తారు కానీ మనం స్వయంగా చెక్ చేసుకోవడం కుదరదు. ఇక మీదట ఇలాంటి ఇబ్బంది ఉండదు అని చెబుతోంది భారత ప్రభుత్వం. నగలు కొనేవారి కోసం ప్రత్యేకమైన యాప్ ని తీసుకువస్తున్నామని చెబుతోంది. బీఐఎస్ కేర్ అనే యాప్ ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. బంగారు నగలు కొనాలంటే హాల్ మార్క్ తప్పనిసరి. దీన్ని కేంద్రం చాలా రోజుల క్రితమే తప్పనిసరి చేసింది. ిప్పుడు దాంతో పాటూ బీఐఎస్ ధ్రువీకరణ పొందిన ఆభరణాలనే కొనుగోలు చేయాలని చెబుతోంది. అన్ని బంగారు నగలకు ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ హెచ్యూఐడీ కోడ్ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. హాల్ మార్కింగ్ సమయంలో ప్రతీ ఆభరణానికి ఒక హెచ్యూఐడీ నంబర్ ఇస్తారు. ఇది ప్రతీ ఆభరణానికి మారుతుంది. దాన్ని బీఐఎస్ కేర్ యాప్తో చెక్ చేసుకోవచ్చును. దాంతో వెంటనే మనం కొంటున్న బంగారం స్వచ్ఛమైనదో కాదో తెలిసిపోతుంది. బంగారంలానే వెండిని కూడా ప్రభుత్వం హాల్ మార్క్ పరిధిలోకి తీసుకువచ్చింది. యాప్ ఎలా పని చేస్తుంది... మొదట ఫోన్ లో బీఐఎస్ కేర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత మన పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ అవ్వగానే వెరిఫై హెచ్యూఐడీ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం కొనాలనుకునే ఆభరణం మీద ఉన్న హెచ్యూఐడీ నంబర్ అందులో ఎంటర్ చేయాలి. వెంటనే వివరాలు అన్నీ అందులో వచ్చేస్తాయి. దుకాణం వేసిన హాల్ మార్క్ తో పాటూ కేంద్రం వేసిన హాల్ మార్క్, స్వచ్ఛత లాంటి వివరాలు కనిపిస్తాయి. అమ్మేవాళ్ళు మన బిల్లు మీద ఇచ్చిన వివరాలతో వాటిని సరిపోల్చుకుంటే సరిపోతుంది. #gold #app #purity #goverment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి