Cricket News: ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సచిన్ ఫ్రెండ్ ఘన విజయం! ఐసీఏ(ICA) ఎన్నికల్లో మాజీ ఆటగాడు చాముండేశ్వర నాథ్ సత్తా చాటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్‌కి ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీ కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన 89 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హర్విందర్ సింగ్‌పై గెలవడంతో ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీగా చాముండేశ్వర నాథ్ ఎన్నికైనట్లు ఐసీఏ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏకే జోటి ప్రకటించారు. By Trinath 26 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఇండియన్ క్రికెట్ అసోసియేషన్(ICA) ఎన్నికల్లో చాముండేశ్వర నాథ్ నాథ్ విక్టరీ కొట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) గవర్నింగ్ కౌన్సిల్‌కి ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీ కోసం జరిగిన ఎన్నికల్లో చాముండేశ్వర నాథ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో హర్విందర్ సింగ్, చాముండేశ్వర నాథ్ మధ్య పోటీ జరిగింది. మొత్తం 545 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో హర్విందర్ సింగ్ 228 ఓట్లు సాధించారు. వంకిన చాముండేశ్వర నాథ్‌కు 317 ఓట్లు వచ్చాయి. దీంతో 89 ఓట్లు తేడాతో హర్విందర్‌పై చాము గెలిచారు. ఐపీఎల్‌కు ఐసీఏ రిప్రజెంటీవ్ నామినీగా చాముండేశ్వర నాథ్ ఎన్నికైనట్లు ఐసీఏ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏకే జోటి ప్రకటించారు. వంకిన చాముండేశ్వరనాథ్ జూన్ 25, 1959న పుట్టారు. 1991 సీజన్‌లో ఏపీకి చాము ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్‌తో పాటు ఆయన అనేక వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై మాస్టర్స్ సహ యజమాని అయిన చాము 19 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టారు. మొత్తం14 సీజన్లలో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించాడు. 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన చాము సగటు 26.34. మొత్తం 1,818 పరుగులు చేశాడు. 1988-89, 1990- 91 మధ్య 13 మ్యాచ్‌లకు ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు: చాముండేశ్వరనాథ్ 2007లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ACA కార్యదర్శిగా, ఆంధ్ర అండర్-19, మహిళల జట్ల సెలెక్టర్‌గా కూడా పని చేశారు. 2009 ఐసీసీ వరల్డ్ టీ20కి భారత జట్టు మేనేజర్‌గా పనిచేశారు. అయితే చామును అనేక వివాదాలు చుట్టుముట్టాయి. 2009 జూన్‌లో ఆయనపై ఏపీ మహిళా క్రికెటర్లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేయగా,, ఆయన్ను ఏసీఏ తొలగించింది. అటు జట్టు ఎంపికలో అవినీతి ఆరోపణలు రావడంతోనూ ఆయనపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. 2015లో ఆంధ్ర మహిళా క్రికెటర్ దుర్గా భవాని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 2009లో చాముండేశ్వరనాథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణపై ఫిర్యాదు చేసిన వారిలో భవానీ కూడా ఉన్నారు. అయితే ఆ కంప్లైంట్‌ను తర్వాత ఆమె ఉపసంహరించుకున్నారు. అటు చాము క్రికెట్ దిగ్గజం సచిన్‌కి మంచి ఫ్రెండ్ కూడా.. పదుల సంఖ్యలో కార్లను సచిన్‌కు గిఫ్ట్ ఇచ్చాడు చాము. Also Read: నా దమ్మేంటో దేశానికి తెలుసు.. రేవంత్ కు కేసీఆర్ కౌంటర్ #cricket #chamundeswari-nath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి