CRIME: కాలిఫోర్నియాలో విషాదం.. ఇండో-అమెరికన్ ఫ్యామిలీ అనుమానస్పద మృతి కాలిఫోర్నియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇండో-అమెరికన్ ఫ్యామిలీలో నలుగురు అనుమాస్పదంగా మరణించారు. మృతులు కేరళకు చెందిన సుజిత్ హెన్రీ, ప్రియాంక, వారి కవల పిల్లలు నోహ్, నీతాన్‌గా పోలీసులు గుర్తించారు. By srinivas 14 Feb 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి California: అమెరికాలోని కాలిఫోర్నియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇండో-అమెరికన్ ఫ్యామిలీ (Indo-American Family) అనుమాస్పదంగా మరణించారు. సంక్షేమ తనిఖీ నిమిత్తం వెళ్లిన అధికారులకు ఆ బ్లాక్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించగా ఈ దారుణం బయటపడింది. కేరళకు చెందినవారే.. ఈ మేరకు శాన్ మాటియో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి ఇంటి తలుపులన్నీ మూసి ఉన్నాయి. లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించి ఓ కిటికీ గుండా లోపలికి వెళ్లగా నలుగురి మృతదేహాలు కనిపించాయని పోలీసులు వివరించారు. మృతులు కేరళకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతడి భార్య అలిస్ ప్రియాంక (40), వారి కవల పిల్లలు నోహ్, నీతాన్‌గా గుర్తించారు. ఇది హత్య-ఆత్మహత్య కేసుగా అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి : Telangana: కిడ్నాప్ ముఠాల కలకలం.. అమాయకులను కొడితే జైలుపాలే! బెడ్‌రూమ్‌లో పిల్లల మృతదేహాలు.. అయితే దంపతులిద్దరూ తుపాకి కాల్పులతో బాత్ రూమ్ లోనే మృతి చెందారు. పిల్లల మృతదేహాలు బెడ్‌రూమ్‌లో కనిపించగా వారు ఎలా ప్రాణాలు కోల్పోయారనేదానిపై స్పష్టత రాలేదన్నారు. ఇంటి చుట్టుపక్కల పరిశీలించగా ఎవరూ లోపలికి వెళ్లినట్టుగా ఆనవాళ్లు దొరకలేదని, అందుకే హత్య-ఆత్మహత్యగా అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. 9ఎంఎం పిస్టల్, లోడ్ చేసిన ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఈ ఘటన ఇంట్లోనే జరిగిందని, బయట వ్యక్తులకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని, బాధ్యుడు ఇంట్లోని వ్యక్తిగా భావిస్తున్నామని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని చెప్పారు. #california #indian-american-couple #twin-sons #found-dead మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి