IND Vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం..సీరీస్ కూడా మనదే.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆరంభంలో కాస్త తడబడినా మ్యాచ్‌ను గెలిపించారు ఇండియన్ బ్యాటర్లు.  ఐదు వికెట్‌ల తేడాతో తో టీమ్ ఇండియా ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సీరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది.

New Update
IND Vs ENG: నాలుగో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం..సీరీస్ కూడా మనదే.

India vs England Fourth Test: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆరంభంలో కాస్త తడబడినా మ్యాచ్‌ను గెలిపించారు ఇండియన్ బ్యాటర్లు.  ఐదు వికెట్‌ల తేడాతో తో టీమ్ ఇండియా ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సీరీస్‌ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది. ఈ సీరీస్‌లో ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఐదవ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు. సీరీస్ టైటిల్‌కు 5వ మ్యాచ్ ఇండియాకు నామమాత్రపు మ్యాచే అవనుంది.

రాంచీ వేదికగా జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్టోల మనవాళ్లు మొదటి నుంచి ఆధిక్యం ప్రదర్శించారు. టాస్ ఓడిపోయి మొదట బౌలింగ్ చేసిన భారత్ చింగ్లాండ్‌ను చాలా తక్కువ స్కోరుకే అవుట్ చేయగలిగింది. కొత్త కుర్రాడు, మొట్టమొదటిసారి టెస్ట్ ఆడుతున్న ఆకాశ్ దీప్ (Akash Deep) వరుసగా మూడు వికెట్లు తీసి చెలరేగిపోయాడు. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జో రూట్ సెంచరీతో మొదటి ఇన్నింగ్స్‌లో 352 పరుగులు సాధించగలిగింది.

Also Read: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు అల్ట్రా లగ్జరీ టెంట్స్..

రెండో రోజు సగం తర్వాత బరిలోకి దిగిన బారత బ్యాట్స్‌మన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 2 పరుగులకే అవుట్‌ కాగా.. వన్‌డౌన్‌బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(38) రజత్‌ పాటిదార్‌ (17), రవీంద్ర జడేజా(12), సర్ఫరాజ్‌ ఖాన్‌(14) విఫలమయ్యారు. అయితే మరో ఓపెనర్ జైశ్వాల్ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడి 73 పరుగులు చేయడంతో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగలిగింది. దీని తరువాత రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపెట్టారు. అశ్విన్ 5, కుల్దీప్ 4 వికెట్లు తీసి బిట్రీషర్లను కుప్పకూల్చారు. దీంతో ఇంగ్లాండ్...ఇండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇవ్వగలిగింది.

మూడో రోజే రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన టీమ్ ఇండియా రోజు ముగిసేసరికి 40 పరుగులు చేసింది. ఇక నాలుగో రోజు అంటే ఇవాళ భారత బ్యాటర్లు కాస్త తడబడ్డారు. ఇంగ్లండ్‌ పేసర్‌ యశస్వి జైస్వాల్‌(37)ను పెవిలియన్‌కు పంపగా.. స్పిన్నర్‌ టామ్‌ హార్లే రోహిత్‌ శర్మ(55)ను అవుట్‌ చేశాడు. తరువాత వచ్చిన రజత్ పాటీ దార్ డక్ అవుట్ అయ్యాడు. జడేజా కూడా 4 పరుగులకే వెనుదిరిగాడు. కానీ శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జ్యూరెల్లు కలిసి టీమ్ ఇండియా మ్యాచ్ విన్ అయ్యేట్టు చేశారు. పట్టుదలగా ఆడి టీమ్ ఇండియా చేతిలో సీరీస్‌ను పెట్టారు. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో టీమిండియా నాలుగో టెస్ట్‌లో విజయం సాధించింది. దాంతో పాటూ సీరీస్‌ను ఎగురేసుకుపోయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు