కుర్ర టీం కుమ్మేసింది.. అండర్-19 ఆసియాకప్‌లో భారత్ శుభారంభం

యువ టీమిండియా అదరగొట్టింది. అండర్-19 ఆసియాకప్‌లో శుభారంభం చేసింది. దుబాయ్‌ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఈ తొలి మ్యాచ్ లో విజయంతో భారత్ బోణీ కొట్టింది. ఏడు వికెట్ల తేడాతో యూత్ టీం ఘన విజయం సాధించింది.

New Update
కుర్ర టీం కుమ్మేసింది.. అండర్-19 ఆసియాకప్‌లో భారత్ శుభారంభం

Under 19 Asia World Cup : యువ టీమిండియా అదరగొట్టింది. అండర్-19(Under-19) ఆసియాకప్‌లో శుభారంభం చేసింది. దుబాయ్‌ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో భారత్ బోణీ కొట్టింది. ఈ తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో యూత్ టీం ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ కులకర్ణి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. మిగతా ఆటగాళ్లూ సత్తా చాటడంతో మ్యాచ్ లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: ఇది మామూలు ఊచకోత కాదయ్యా! 43 బంతుల్లో 193 పరుగులు

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 173 స్వల్ప పరుగులకు కుప్పకూలగా, టీమిండియా(Team India) 37.3 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది. తక్కువ పరుగులకే ఆఫ్ఘన్ జట్టును పరిమితం చేయడంతో టీమిండియాకు విజయం సులభతరమైంది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఓపెనర్‌ జంషీద్ జద్రాన్‌ (43) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్‌ లింబానీ, కులకర్ణి చెరో మూడు వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్థాన్ టీంను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. నమాన్‌ తివారీ రెండు వికెట్లతో రాణించాడు.

ఇది కూడా చదవండి: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్‌ రిపోర్ట్!

అనంతరం 174 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఛేజింగ్ లో కెప్టెన్‌ కులకర్ణి 70 పరుగులతో ఆజేయంగా నిలిచి విజయంతో ముగింపు పలికాడు. ముషీర్‌ ఖాన్‌ 48 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. డిసెంబర్‌ 10న జరగబోయే తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు