IND vs ENG: తోపులు ఔటయ్యారు.. తురుములు ఔటవ్వాలి.. హైదరాబాద్‌లో రసవత్తర పోరు! హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పోరు తొలి సెషన్ నుంచి హోరాహోరీగా సాగుతోంది. లంచ్ బ్రేక్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసింది. క్రీజులో రూట్, బెయిర్‌స్టో ఉన్నారు. అశ్విన్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశాడు. By Trinath 25 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి INDIA VS ENGLAND Hyderabad Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇంగ్లండ్ చెప్పినట్టుగానే బాజ్‌బాల్ క్రికెట్‌ను ఆడుతోంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా జాక్ క్రావ్‌లీ, బెన్ డకెట్ దిగారు. ఇద్దరు భారత్ బౌలర్లపై దాడికి దిగారు. The Roar of Ashwin after getting First breakthrough for India#INDvsENG pic.twitter.com/okDAUQTznu — Don Cricket 🏏 (@doncricket_) January 25, 2024 తేలిపోయిన హైదరాబాదీ హీరో: తొలి రోజు ఆట తొలి సెషన్‌లో సిరాజ్ తేలిపోయాడు. సొంత గడ్డపై తొలిసారి టెస్టు ఆడుతున్న సిరాజ్ ఆకట్టుకోలేకపోయాడు. ఓపెనర్లు క్రావ్లీ, బెన్ డకెట్ సిరాజ్ టార్గెట్‌గా బౌండరీల వర్షం కురిపించారు. మరో ఎండ్‌లో బుమ్రా పొదుపుగానే బౌలింగ్ వేసినా ఇంగ్లండ్‌కు మాత్రం కావాల్సినన్ని రన్స్ వచ్చాయి. ఈ జోడి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రంగంలోకి దిగాడు. బెన్ డకెట్‌ను LBW చేసి పెవిలియన్‌కు పంపాడు. 39 బంతులు ఆడిన డకెట్ 35 రన్స్ చేశాడు. అతని ఖాతాలో 7 ఫోర్లు ఉన్నాయి. తొలి వికెట్‌కు క్రావ్‌లీతో కలిసి 11.5 ఓవర్లలో 55 రన్స్ పార్ట్‌నర్‌షిప్ చేశాడు. ఆ తర్వాత వన్ డౌన్‌లో దిగిన పోప్ కేవలం ఒక్క పరుగే చేశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 58 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. Reflexes 🥵🥵 Vintage Rohit Sharma 🔥 🔥 #INDvsENG #INDvENG #RohitSharma𓃵pic.twitter.com/UL5ddYlGB2 — RoMan (@SkyXRohit1) January 25, 2024 ఆ తర్వాత వెంటనే ఓపెనర్ క్రావ్‌లీ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఔటో, నాటౌటో తెలియదు కానీ అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్ పట్టిన క్యాచ్ వివాదాస్పదమైంది. ఎందుకంటే రిప్లైలో సిరాజ్ స్పష్టంగా క్యాచ్ చేసినట్టు కనిపించలేదు. అయినా థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దీంతో 20 పరుగులు చేసిన క్రావ్‌లీ ఔటయ్యాడు. 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను మరో వికెట్ పడకుండా రూట్, బెయిర్‌స్టో ముందుకు నడిపించారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 28 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 108 రన్స్ చేసింది. Also Read: రిటైర్ అవ్వలేదు.. అంతా అబద్ధం.. కుండబద్దలు కొట్టిన మేరికోం! #hyderabad #india-vs-england మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి