IND VS AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 జరుగుతుందా? రేపు(నవంబర్ 26) తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. By Trinath 25 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి మొదటి టీ20లో దుమ్ములేపారు. రెండో టీ20కు సిద్ధమయ్యారు. రేపు(నవంబర్ 26) కేరళ రాజధాని తిరువనంతపురం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20 జరగనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 లీడ్‌లో ఉంది. రేపటి మ్యాచ్‌లోనూ గెలిచి లీడ్‌ని మరింత పెంచాలని భారత్ భావిస్తోంది. అయితే కొద్ది రోజులుగా తిరువనంతపురంలో వర్షం పడుతోంది. దీంతో రేపటి మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. Surya & Co. Have Reached Thiruvananthapuram to take on Australia in 2nd T20I 🔥🔥 All the best Team India 👍❤️#SuryaKumarYadav #indvsaust20#INDvsAUS #RohitSharma𓃵pic.twitter.com/RKapvfOUXl — RoMan (@SkyXRohit1) November 24, 2023 అదే జట్టులో టీమిండియా: ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా రెండు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఎప్పటిలాగే తన సత్తా నిరూపించుకున్నాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. 209 పరుగుల టార్గెట్‌లో రెండు వికెట్ల పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యాభాయ్ 42 బంతుల్లోనే 80 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇక చివరిలో రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. చివరి వరకు ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. 14 బంతుల్లో 22 రన్స్ చేశాడు రింకూ. వర్షం పడుతుందా? రేపటి మ్యాచ్‌కు రెయిన్ ముప్పు పొంచి ఉంది. అయితే మ్యాచ్ రద్దయ్యే అంత వర్షం కురవదని సమాచారం. వాతావరణశాఖ ప్రకారం తిరువనంతపురంలో రేపు మ్యాచ్ మొదలైన తర్వాత వర్షం పడే ఛాన్స్ 11శాతంగా ఉంది. రేపు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. మ్యాచ్ వివరాలు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: రెండోటీ20 మ్యాచ్ వేదిక: గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం సమయం: 7PM IST స్ట్రీమింగ్: స్పోర్ట్స్ 18, జియో సినిమా ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): ట్రావిస్ హెడ్/మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, మాథ్యూ వేడ్ (c/wk), సీన్ అబాట్, నాథన్ ఎలిజం జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా/తన్వీర్ సంఘా టీమిండియా తుది జట్టు(అంచనా) యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (wk), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ Also Read: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా…? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..! WATCH: #kerala #india-vs-australia #suryakumar-yadav #thiruvananthapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి