విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఆనాడే ప్రధాని మోడీ జోస్యం

విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ 2019 లోనే జోస్యం చెప్పారు. నాడు తన ప్రభుత్వం పై అవి అవిశ్వాసం పెట్టినప్పుడు 2023 లో కూడా ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వ వర్గాలు ఆ నాటి ఆయన ప్రసంగాన్ని మళ్ళీ బుధవారం గుర్తుకు తెచ్చాయి. మణిపూర్ అంశంపై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.

New Update
విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఆనాడే ప్రధాని మోడీ జోస్యం

india-prime-minister-modi-jyosyam-2019-2023

మోడీ ప్రభుత్వంపై విపక్షాలు లోక్ సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఒక్కసారి..భారత పార్లమెంట్ చరిత్రలో వీటి కథా కమామీషును గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సంఖ్యాపరంగా ఇది 27 వ తీర్మానం.. బీజేపీ ప్రభుత్వం పైన, ఈ పార్టీకి చెందిన ప్రధాని పైన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2003 లో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంపై అప్పటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ పార్లమెంటులో అది వీగిపోయింది.

అలాంటి ఉదంతం మళ్ళీ !

నాడు జరిగిన ఆ ఉదంతంవంటిది తిరిగి ఇప్పుడు పునరావృతమవుతోంది.నాటి తీర్మానాన్నీ , ఈనాటి తీర్మానాన్నీ ఒక్కసారి పరిశీలిస్తే పోలికలు ఎన్నో కనిపిస్తాయి. 2003 లో అలా జరిగినప్పుడు 2004 లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి.అలాగే ఈ సారి ..2023 లో విపక్షాలు మోడీ సర్కార్ పై అవిశ్వాసం తెస్తే.. 2024 లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఏడాది ముందు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ తాజా చరిత్రకెక్కింది. అంటే ఇక్కడ జరిగిన టైం ఫ్రేమ్ లోని విశేషమిది.నాడూ, నేడూ బీజేపీ ప్రభుత్వాల హయాంలోనే ఇవి చోటు చేసుకున్నాయి.

అవిశ్వాస తీర్మానం ఏమంటోంది ?

రాజ్యాంగం ప్రకారం లోక్ సభలో మెజారిటీ ఉన్న పక్షంలోనే అధికారంలో ఉండడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది. రాజ్యాంగం లోని 75 (3) అధికరణం ప్రకారం.. లోక్ సభకు మంత్రి మండలి అంతా సమిష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి మెకానిజాన్నే 'నో కాన్ఫిడెన్స్ మోషన్' గా వ్యవహరిస్తున్నారు. లోక్ సభ నిబంధనల్లో ఇది కూడా ఒకటి. ఈ రూల్ ప్రకారం ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టాలంటే ఓ ఎంపీకి 50 మందికి పైగా సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ఆ తరువాత దానిపై సభలో చర్చ జరుగుతుంది. ఈ సారి 7 గంటలకు పైగా చర్చ జరిగే అవకాశం ఉంది.

1963 నుంచే ప్రారంభమైన ప్రక్రియ

1963 లో మొదటిసారిగా మూడో లోక్ సభ సమయంలో అవిశ్వాస తీర్మానాన్ని అప్పటి ప్రధాని దివంగత జవహర్లాల్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ నేత, ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు కూడా అయిన ఆచార్య జె.బి. కృపలానీ ప్రవేశపెట్టారు. 40 మంది ఎంపీలు ప్రతిపాదించిన ఆ తీర్మానం మీద నాలుగు రోజుల పాటు.. 21 గంటలపాటు చర్చలు జరిగాయి. అయినా నెహ్రూ ప్రభుత్వం నెగ్గగలిగింది. 1964 లో రెండో అవిశ్వాస తీర్మానాన్ని అప్పటి ప్రధాని దివంగత లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంపై ఇండిపెండెంట్ సభ్యుడు ఎన్. సి. ఛటర్జీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 1964-75 మధ్య కాలంలో 15 కి పైగా అవిశ్వాస తీర్మానాలను విపక్షాలు నాటి ప్రభుత్వాలపై పెట్టాయి. 12 తీర్మానాలను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎదుర్కోవలసి వచ్చింది. 1981-1982 లో ఆమె మూడు తీర్మానాలను ఎదుర్కొన్నారు . కానీ ప్రతిసారీ విజయం ఆమెను వరించింది. 1979 లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంపై వై.బి. చవాన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. నాటి పరిణామాల్లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్రభుత్వం పడిపోవడానికి మొదటిసారిగా ఆ అవిశ్వాస తీర్మానం దోహదపడింది.

రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల హయాంలో

india-prime-minister-modi-jyosyam-2019-2023

1987 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాసం తెచ్చినా ఆయన నెగ్గారు. తరువాత 10వ లోక్ సభలో పీవీ నరసింహారావు సర్కార్ పై విపక్షనేత జస్వంత్ సింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రతిపాదించారు. ఆ తరువాత అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్ పేయి మరో అవిశ్వాస తీర్మానాన్ని ప్రాతిపాదించినప్పటికీ కేవలం 14 ఓట్లతో పీవీ దాన్ని 'ఓడించారు'.

ఒక్క ఓటుతో..పడిపోయిన వాజ్ పేయి ప్రభుత్వం

india-prime-minister-modi-jyosyam-2019-2023

1999 లో వాజ్ పేయి ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటుతో నెగ్గడంతో ఆ ప్రభుత్వం పడిపోవడం మాత్రం విశేషం.ఇక ఇప్పుడు ప్రధాని మోడీ ప్రభుత్వం పై 26 పార్టీల తో కూడిన విపక్ష 'ఇండియా' కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకి లోక్ సభలో తగినంత మెజారిటీ ఉంది.రాజ్యసభలోనూ కాస్త కష్టమే అయినా ఈ తీర్మాన గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కవచ్చునని భావిస్తున్నారు. మణిపూర్ అంశంపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడుతున్నామని విపక్ష కూటమి ఇదివరకే స్పష్టం చేసింది. 2018 లో లోక్ సభలో మోడీ ప్రభుత్వం 195 ఓట్లతో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించింది. 135 మంది సభ్యులు ఆ తీర్మానాన్ని సమర్థించినా..330 మంది ఎంపీలు దాన్ని తిరస్కరించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు