Plastic production: ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ నెం1 ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతియేటా 10.2M టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నట్లు బ్రిటన్ 'యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్' అధ్యయనం వెల్లడించింది. అమెరికా 90, బ్రిటన్ 135వ స్థానంలో ఉన్నాయి. నగరాల్లో లాగోస్ ఫస్ట్ ప్లేస్. By srinivas 05 Sep 2024 in ఇంటర్నేషనల్ వాతావరణం New Update షేర్ చేయండి Plastic production: ప్రపంచంలోనే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 2, బంగ్లాదేశ్ 3, రష్యా 4, బ్రెజిల్ 5 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇండియాలో ప్రతియేటా 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతుండగా.. 8 దేశాల నుంచి ప్రపంచంలో సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న నగరంగా గుర్తించారు. ఢిల్లీ, కరాచీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే జాబితాలో నైజీరియా, ఇండోనేసియా, చైనా ముందంజలో ఉండగా అమెరికా 90, బ్రిటన్ 135వ స్థానంలో నిలిచాయి. ప్రపంచం మొత్తం మీద ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, మూడింట రెండు వంతులు దక్షిణ భూగోళానికే చెందినవిగా అధ్యయనం పేర్కొంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి