India - Maldives: బలగాల ఉపసంహరణపై భారత్ - మాల్దీవుల మధ్య భేటీ..

మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై ఈరోజు (శుక్రవారం) కోర్‌ కమిటీ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ అంశంలో పరస్పర ప్రయోజనాలు చేకూర్చేలా.. పరిష్కరం కనుగొనడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి.

New Update
India - Maldives: బలగాల ఉపసంహరణపై భారత్ - మాల్దీవుల మధ్య భేటీ..

ఇటీవల భారత్ - మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై ఈరోజు (శుక్రవారం) కోర్‌ కమిటీ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇందులో ఇరు దేశాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

భారత బలగాలు వెళ్లిపోవాలి

అయితే ఇటీవల మాల్దీవుల్లో జరిగిన ఎన్నికల్లో చైనాకు అనుకూలంగా ఉండే మహ్మద్‌ మయిజ్జు అధికారంలోకి రావడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా దుమారం రేపింది. ఈ క్రమంలోనే మార్చి 15వ తేదీ నాటికి తమ దేశ భూభాగం నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని మయజ్జు ఇటీవల గడువు విధించారు. 2023 డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీతో.. మయిజ్జు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కోర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

Also Read: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..వారంలో మూడో కేసు!

80 మందితో భారత సైన్యం

రెండు వారల క్రితమే ఈ కమిటీ మాలెలో సమావేశం కాగా.. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో భేటీ అయ్యింది. అయితే ఈ అంశంలో పరస్పర ప్రయోజనాలు చేకూర్చేలా.. పరిష్కరం కనుగొనడంపై ఇరు దేశాలు కూడా దృష్టి సారించాయి. అయితే మాల్దీవుల్లో 80 మందితో కూడిన భారత సైన్యం ఉంటోంది. ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. మరో విషయం ఏంటంటే భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సైతం సహకరిస్తాయి.

ఇరు దేశాలకు ప్రయోజనాలు చేకూర్చేలా 

ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఈ కమిటీ మాల్దీవుల రాజధాని మాలెలో భేటీ అయ్యింది. తాజాగా దిల్లీలో మరోసారి సమావేశం నిర్వహించింది. ఈ అంశంలో పరస్పర ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని కనుగొనడంపై ఇరు దేశాలు దృష్టి సారించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Also Read: బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌: మమతా బెనర్జీ

Advertisment
Advertisment
తాజా కథనాలు