లండన్ వీధుల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశభక్తితో భారతీయుల మనసు ఊవిళ్లురుతుంది. ఇండియాలోనే కాదు ప్రపంచం నలమూలాల ఉన్న భారతీయుల గుండెల్లో దేశభక్తి ఉప్పొంగిపోతుంది.

New Update
లండన్ వీధుల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశమంతా పంద్రాగస్టు వేడులకు ఘనంగా జరుగుతున్నాయి. భారతీయ జెండాలు ఎగరవేస్తూ అమరులకు సలాం చేస్తున్నారు. ఇక్కడే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల్లో దేశభక్తి ఉప్పొంగింది. లండన్‌లోని వీధుల్లో భారత్, పాక్ ప్రజలు కలిసి 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జెండాలు చేత పట్టుకుని పాటల పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో విష్ అనే సింగర్ దేశభక్తి గీతాలు పాడి అందర్నీ ఉత్సాహపరిచాడు. బాలీవుడ్ సినిమాల్లోని మా తుజే సలామ్, సందేసె ఆతే హై, తేరి మిట్టి వంటి దేశభక్తి గీతాలు పాడుతూ అలరించాడు.

View this post on Instagram

A post shared by Vish (@vish.music)

లండన్‌లోని ఓ వీధిలో భారతీయులు, పాకిస్తానీయులు కలిసి జెండాలు ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. "యూకేలో భారతీయులు మరియు పాకిస్తానీయులు యూకేలో కలిసి జరుపుకుంటున్న వేడుకలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ ఈ వీడియోను సింగర్‌ విష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాయాది దేశస్తులతో కలిసి మనల్ని పాలించిన దేశంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓసారి మీరు కూడా ఈ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి.

View this post on Instagram

A post shared by Vish (@vish.music)

ఇక 77 వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరవేశారు. సారి త్రివర్ణ పతాకాన్ని స్వదేశీ 105 ఎంఎం ఫీల్డ్ గన్‌తో గౌరవించారు. అనంతరం జాతిని ఉద్దేశిస్తూ 90 నిమిషాల పాటు ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి సహకరించిన వీరులందరికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం.. ఇప్పుడు జనాభా పరంగా కూడా అగ్రగామి దేశం అన్నారు. ఇంత పెద్ద దేశంలోని 140 కోట్ల మంది సభ్యులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని.. శాంతి ద్వారానే పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని మోదీ వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు