Modi-Zelensky: ప్రధాని మోదీ, జెలెన్‌స్కీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్ ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. అలాగే ఇరుదేశాధినేతలు వ్యక్తిగతంగా, బృందస్థాయిలో భేటీ కానున్నారు By B Aravind 23 Aug 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి ప్రధాని మోదీ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ఆయన భేటీ అయ్యారు. ముందుగా రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి మోదీ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు స్వాగతం పలికిన జెలెన్‌స్కీ ఆత్మీయ ఆలింగన చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న సంక్షోభాలకు సంబధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇరు దేశాధినేతలు వీక్షించారు. Also Read: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రధాని మోదీతో జెలెన్‌స్కీ వ్యక్తిగతంగా, బృందస్థాయిలో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. '' అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళులు అర్పించాం. ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైనది. ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. బాధల నుంచి బయటపడే ధైర్యాన్ని వారికి ఇవ్వలని ప్రార్థిస్తున్నాను'' అని పోస్ట్ చేశారు. మరోవైపు కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి కూడా ప్రధాని మోదీ నివాళులర్పించారు. గాంధీ ఆశయాలు విశ్వవ్యాప్తమయ్యాయని.. కోట్లాది మందికి ఆయన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మానవాళికి మహాత్ముడు చూపించి బాటలో నడుద్దామంటూ పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా.. ఇంతకుముందు రెండురోజుల పాటు ప్రధాని పోలండ్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడ్డ తర్వాత ఆ దేశానికి భారత ప్రధానమంత్రి వెళ్లడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. Also Read: కుప్పకూలిన విమానం…తెలియని ప్రయాణికుల జాడ! #Watch | PM @narendramodi and President Zelenskyy honour the memory of children at Martyrologist Exposition#PMModiInUkraine @meaindia @pmoindia pic.twitter.com/KCOqfGb85z — DD News (@DDNewslive) August 23, 2024 #modi #zelensky #russia-ukraine మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి