Allu Ayaan: పోలీసులకు చెబితే అయిపోతావ్.. బన్నీకి అల్లు అయాన్ వార్నింగ్! అల్లు అయాన్ అల్లరి పనులను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇటీవల అయాన్ అల్లరి చేస్తుంటే..చేయి ఎత్తానని..దానికి “ అమెరికాలో పిల్లలను కొడితే..పోలీసులకు ఫోన్ చేస్తారని తెలుసా?’’ అంటూ అయాన్ బెదిరించాడని బన్నీ ఒక పోస్ట్ షేర్ చేశారు. అది ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. By KVD Varma 01 Mar 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Allu Ayaan: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. మెగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. తరువాత తనదైన స్టైల్.. స్పెషల్ యాక్టింగ్ స్కిల్స్ తో రైజింగ్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఓ బ్రాండ్ అయ్యాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. బన్నీకి ఇద్దరు పిల్లలు అనే విషయం తెలిసిందే. అల్లు అర్హ ఇప్పటికే ఒక సినిమాలో నటించింది. శాకుంతలం సినిమాతో సమంత తో కలిసి సందడి చేసింది అర్హ. ఇక అల్లు అర్జున్ కొడుకు అయాన్ (Allu Ayaan)సినిమాల్లో ఎంట్రీ ఇవ్వలేదు కానీ.. చిచ్చర పిడుగు. తాను చేసే అల్లరి పనులు.. చిలిపి చేష్టలు.. అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. వాటిని అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. తరుచు అయాన్ చేసిన ముద్దు ముద్దు పనులకు సంబంధించి బన్నీ షేర్ చేసే వీడియోలు వైరల్ అయిపోతుంటాయి. ప్రస్తుతం అల్లు అయాన్ ఫన్నీ వీడియోలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మొన్న అల్లు అయాన్ మెడలో కుర్తీతో మోడలింగ్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియో బాగా ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే అల్లు అయాన్(Allu Ayaan) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2 సినిమాలో అయాన్ కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ వార్తల మాట ఎలా ఉన్నా.. ఇప్పుడు అయాన్ కి సంబంధించి.. బన్నీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. Also Read: దేశభక్తి నేపధ్యంలో ప్రేక్షకులకు గూస్ బంప్స్.. ఆపరేషన్ వాలెంటైన్ సమంత హోస్ట్ గా ఆహాలో సామ్ జామ్ కార్యక్రమం ప్రసారమైన సంగతి తెలిసిందే. దీనిలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ అతిథులుగా వచ్చారు. ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ అల్లు అయాన్ (Allu Ayaan)గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఒకసారి అయాన్ ఎదో అల్లరి చేస్తుంటే.. బన్నీ అల్లరి చేయవద్దు అంటూ చెయ్యి ఎత్తాడంట. దానికి అల్లు అయాన్ ఇచ్చిన రియాక్షన్ తో మతిపోయింది అని అల్లు అర్జున్ చెప్పాడు. ‘’నన్ను కొట్టాలని చూస్తున్నావా? అమెరికాలో పిల్లలను కొడితే... పోలీసులకు ఫోన్ చేస్తారని తెలుసా?’’ అంటూ సీరియస్ గా తండ్రిని అడిగాడట అయాన్. దీంతో షాక్ అయిన బన్నీ.. కొట్టను లేరా బాబు.. సరదాగా అన్నాను అంటూ అయాన్ కి చెప్పాడట. ఈ విషయాన్ని చెప్పడంతో అక్కడ సమంత తో పాటు అల్లు అరవింద్ కూడా నవ్వేశారు. మొత్తానికి పిల్లలను కొట్టాలని చూస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అని అనడం బన్నీ అభిమానులకు తెగ నచ్చేసినట్టు ఉంది. ఈ పోస్ట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అది మీరు కూడా ఇక్కడ చూసేయండి.. View this post on Instagram A post shared by Allu Arjun Official Page (@alluarjunxstream) #allu-arjun #allu-ayaan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి