TS: తెలంగాణలో స్పెషల్ డీఎస్సీకి కసరత్తు.. సీతక్కతో మంతనాలు! తెలంగాణలో స్పెషల్ డీఎస్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక ట్రైబల్ డీఎస్సీని నిర్వహించాలంటూ ఆదివాసీ సేవా సమితి సంఘ సభ్యులు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీతక్క అధికారులు సూచించారు. By srinivas 02 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Special Dsc: తెలంగాణలో స్పెషల్ డీఎస్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక ట్రైబల్ డీఎస్సీని నిర్వహించాలంటూ ఆదివాసీ సేవా సమితి సభ్యులు మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ జనరల్ ఏజేన్సీలో సైతం ఖాళీలను గిరిజనులతో నింపాలని విజ్ఞప్తి చేశారు. సీతక్క సానుకూల స్పందన.. ఈ మేరకు అభ్యర్థులు డిమాండ్ కు సానూకూలంగా స్పందించిన మంత్రి సీతక్క తక్షణమే ట్రైబల్ డీఎస్సీ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐటీడీఏలను సెక్లార్లుగా తీసుకోవాలని కమిషనర్ కు సూచించారు. లేని పక్షంలో గిరిజన నిరుద్యోగులు నష్టపోతారని, తక్షణమే ఇందుకు సంబంధించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీతక్క సూచించారు. ఇది కూడా చదవండి : Ramayanam: రణ్‍బీర్, సాయిపల్లవి ‘రామాయణం’ నుంచి బిగ్ అప్ డేట్! ఆవావాసి సంఘాల హర్షం.. ఇక మంత్రి సీతక్క చొరవపై ఆదివాసీ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, వజ్జ రాజు, ప్రధాన కార్యదర్శి గొంది ఆశోఖ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దబోయిన రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మద్దెల చందు, జిల్లా ఆదివాసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మంకిడి రవి, ఈసం రాములు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మార్చి 4నుంచి డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది. #telangana #minister-sitakka #tribal-special-bed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి