Health tips: సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడే టీలు

శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. వీటిల్లో జలుబు, దగ్గు చాలా కామన్. సీజనల్ ఇన్ఫెక్షన్‌కి ఏవైనా మనపై ఎఫెక్ట్ చూపకుండా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కొన్ని కషాయాలు, టీలు హెల్ప్ అవుతాయి. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ టీలు చాలా వరకు మంచివి.

New Update
Health tips: సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడే టీలు

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా మనలోని ఇమ్యూనిటీని పెంచే టీలు ఎన్నో ఉన్నాయి. వీటి తయారీకి ఎక్కువ కష్టపడక్కర్లేదు. కొన్ని నిమిషాల్లోనే తయారయ్యే ఈ టీలు మన రోగాలను తగ్గించడమే కాదు శరీరానికి అదనపు బలాన్ని, ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి. ఆ టీలేంటో...అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సుకు టీ..

ధనియాలు 2 చెంచాలు
సుకు పొడి 1 చెంచా
మిరియాల పొడి పావు చెంచా
జీలకర్ర పొడి పావు చెంచా
నీరు 3 కప్పులు

తయారీ విధానం..

ఓ గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి.ధనియాలు, మిరియాల పొడి వేయాలి, జీలకర్ర పొడి కూడా వేసి మరిగించాలి. మూడు గ్లాసుల నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు అందులో తేనె వేసి ఆస్వాదించడమే.

ఈ సుకు టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.బాడీని కాపాడుతుంది. జలుబు, ఫ్లూ తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది.ధనియాలు తీసుకోవడం వల్ల ఆపానవాయువు, కడుపు ఉబ్బరం నుండి రిలాక్స్ అవుతాము.దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం
లభిస్తుంది.

తులసి టీ..

నీరు 2 కప్పులు
తులసి ఆకులు గుప్పెడు
నిమ్మరసం 2 స్పూన్లు

తయారీ విధానం..

ఓ పాత్రలో నీరు వేసి బాగా మరిగించాలి. బాగా కడిగిన తర్వాత తులసి ఆకులని వేయండి. ఇలా మరిగేటప్పుడు పాన్‌పై మూతపెట్టి మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి కాస్తా చల్లార్చాలి. తాగడానికి కావాల్సినంత గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసి తాగాలి.

సీజనల్ సమస్యల నుండి రిలాక్సేషన్ ఇస్తుంది. దగ్గు, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది. ఛాతీ ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.

అతి మధురం టీ...

లైకోరైస్ పొడి (అతిమధురం) 1 చెంచా
పంచదార అరచెంచా
నీరు 3 కప్పులు

తయారీ విధానం..

ప్యాన్ తీసుకుని అందులో నీరు మరిగించాలి. నీరు బాగా మరిగిటప్పుడు అందులో లైకోరైస్ పొడి వేసి మరిగించాలి. 3 కప్పుల నీరు ఒకటిన్నర కప్పులు సగమయ్యేవరకూ రిగించాలి. తర్వాత తేనె వేసుకుని తాగడమే.

దీని వలన గొంతునొప్పి దూరమవుతుంది. సీజనల్ సమస్యైనా దగ్గు దూరమవుతుంది. అంటువ్యాధులు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే ఇవన్నీ కొంతవరకే పని చేస్తాయని గుర్తు పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా ఉంటే ఎప్పుడూ డాక్టర్ ను సంప్రదించడమే మంచిది.

Also Read:వరుణ్-లావణ్యల పెళ్ళికి గెస్ట్ లుగా నాగచైతన్య, సమంత

Advertisment
Advertisment
తాజా కథనాలు