Weather Alert: ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రాల్లో హీట్‌వేవ్..

ఏప్రిల్ నుంచి జూన్‌ మధ్యకాలంలో 10 నుంచి 20 రోజలు వరకు హీట్‌వేవ్ ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, ఒడిశా, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్‌గఢ్, ఉత్తర కర్నాటక రాష్టాల్లో ఎక్కువగా ఉండనుందని పేర్కొంది.

New Update
Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్‌ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్న అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయని.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా ఉండనున్నాయని తెలిపింది. ఈ రెండు నెలల పాటు దేశంలో 10 నుంచి 20 రోజులు తీవ్రమైన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

Also read: జ్ఞానవాపి కేసులో స్టేకు నిరాకరించిన సుప్రీం..ఇరు మతాలు పూజలు చేసుకోవాలని సూచన

ఈ హీట్‌వేవ్ ప్రభావం.. ఎక్కువగా రాజస్థాన్, ఒడిశా, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్‌గఢ్, ఉత్తర కర్నాటక రాష్టాల్లో ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఏప్రిల్‌ నెలలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. సెంట్రల్, దక్షిణ భారత్‌ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్‌లో కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , ఒడిషాలో హీట్‌వేవ్‌ ఉంటుందని అంచనా వేసింది.

Also Read: అప్పటివరకు అమెరికాలోనే ప్రభాకర్ రావు.. పోలీసులకు కీలక సమాచారం!

Advertisment
Advertisment
తాజా కథనాలు