Weather ForeCast: రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే..! తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఎలా ఉండనుందో వాతావరణ కేంద్రం నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 29 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Weather ForeCast: హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందో నివేదికను విడుదల చేసింది. తెలంగాణ రాజధాని నగరంలో 65 శాతం వర్షంపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు ఉండగా...కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఏపీలోని విజయవాడలో 40 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా ఉండగా..కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతి లో 14 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలుగా ఉండగా... కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా ఉండనున్నాయి. విశాఖ పట్నంలో 88 శాతం వర్షం పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. 30 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రతలుగా ఉండగా.. 26 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలుగా ఉండనున్నట్లు అధికారులు వివరించారు. Also Read: 5 నెలల తరువాత కేసీఆర్‌ను కలవనున్న కవిత #rains #weather #tempuratures మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి