ఐఐటీ విద్యార్థి మిస్సింగ్‌ మిస్టరీ విషాదం!

హైదరాబాద్‌ ఐఐటీ మిస్సింగ్‌ మిస్టరీ విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన విద్యార్థి కార్తీక్‌ విశాఖ బీచ్‌ లో శవమై తేలాడు. జులై 17 రాత్రి నుంచి కార్తీక్‌ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..కార్తీక్‌ వైజాగ్‌ వెళ్లినట్లు గుర్తించారు.

New Update

iit student missing case tragic end

ఈ క్రమంలోనే సోమవారం కొందరు స్థానికులు వైజాగ్‌ బీచ్‌ లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఆ మృతదేహం ఐఐటీ విద్యార్థి కార్తీక్‌ దిగా గుర్తించారు. దీంతో వారు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చేతికి అందివచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు కార్తీక్‌ డెడ్‌ బాడీని విశాఖ జీజీహెచ్‌ కు తరలించినట్లు పోలీసులు వివరించారు. కార్తీక్‌ ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థి కార్తీక్‌ ది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. సంగారెడ్డి కంది ఐఐటీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే కార్తీక్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. సెకండ్‌ ఇయర్‌ లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవ్వడం వల్లే కార్తీక్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. పరీక్షల్లో తప్పడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు