Fenugreek Health Benefits: బరువు తగ్గించే ఆకు కూరలు ఇవే..షుగర్ కూడా తగ్గుతుంది

ఇటీవల కాలంలో చాలామంది బరువు పెరుగుదల, ఘగర్‌ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల్ని దూరం చేసేందుకు మెంతికూర ఉపయోగపడుతుంది. మెంతికూరతో నెలసరి, లైంగిక సమస్యలు, బరువు, షుగర్‌ లాంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Fenugreek Health Benefits: బరువు తగ్గించే ఆకు కూరలు ఇవే..షుగర్ కూడా తగ్గుతుంది

fenugreek health benefits: ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా మంచిదని మనకు తెలుసు. వీటిల్లో ఒక్కో కూర ఒక్కో గుణాన్ని కలిగి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే హెల్దీ ఫుడ్స్ తినాలని వైద్యులు చెబుతుటారు. ఆరోగ్యానికి ప్రతీ ఆకుకూరలు మేలు చేస్తాయి. సహజ, సేంద్రీయ పద్ధతిలో పండించి మెంతికూరని తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మెంతికూర తింటే మన శరీరంలో వేడి పెరుగుతుంది. ఇందులో బాడీకి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. చలికాలంలో మెంతికూరని ఏదో ఓ రూపంలో తింటే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం.

నెలసరి సమస్యలు: మహిళలు ప్రతీనెల ఈ బాధను పడుతునే ఉంటారు. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మరి చెక్ పెట్టడంలో మెంతికూర బెస్ట్‌. పెయిన్ కిల్లర్స్ వాడే బదులు మెంతికూరని తింటే చాలా వరకూ నొప్పులు, తిమ్మిర్ల వంటి సమస్యలు పోతాయి.
బరువు: చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతారు. అలాంటి వారు మెంతులని తీసుకుంటే ఆకలిని కంట్రోల్ చేసి జీవక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ నుంచి కేలరీలు తక్కువగా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.
లైంగిక సమస్యలు: ఈ మధ్యకాలంలో పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను మెరుగ్గా చేస్తాయని ఓ పరిశోధనలో తెలిపింది. ఈ కారణంగా మెంతి సారాన్ని రెగ్యులర్‌గా ఆరు వారాల పాటు తీసుకుంటే పురుషుల్లో లైంగిక ఆసక్తి, శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
హార్మోన్ల బ్యాలెన్స్: హార్మోన్ల బ్యాలెన్స్ అనేది మన బాడీలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం హార్మోన్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వారు మెంతికూర తింటే పురుషులు, మహిళల్లోనూ హార్మోన్ల బ్యాలెన్స్‌ సమస్య తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు: మెంతుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేసి మన శరీరంలో గ్లూకోజ్‌ని గ్రహించేలా చేస్తాయి. కావున షుగర్ సమస్య ఉన్నవారు రోజూ మెంతి ఆకుల్ని గోరువెచ్చని నీటిలో నానబెట్టి తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కొబ్బరి లస్సీ ఎలా చేస్తారు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు