పిల్లల పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. అద్భుత ప్రయోజనాలు! భారత ప్రభుత్వ మద్దతు గల పీపీఎఫ్ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మనం మన పేరు మీదే కాకుండా, పిల్లల పేరు మీద కూడా PPF అకౌంట్ తెరవచ్చు.అది ఎలానో ఇప్పుడు తెలుసుకోండి! By Durga Rao 20 Apr 2024 in బిజినెస్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి డబ్బుపై మంచి రాబడిని అందుకోవాలని అనుకుంటున్నారా? పన్ను మినహాయింపు కూడా కావాలా? అయితే మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కంటే మంచి పథకం దొరకదు! భారత ప్రభుత్వ మద్దతు గల ఈ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మనం మన పేరు మీదే కాకుండా, పిల్లల పేరు మీద కూడా PPF అకౌంట్ తెరవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే డబ్బు దాచుకోవడానికి ఇది చాలా మంచి ఐడియా. పిల్లల పేరు మీద అకౌంట్ తెరిచి, కళ్లు చెదిరే రిటర్న్స్, పన్ను మినహాయింపు లాభాలు పొందవచ్చు. PPF అకౌంట్‌లో జమ చేసే మొత్తం ఆదాయ పన్ను నుంచి ఎగ్జమ్షన్ పొందుతుంది. అయితే పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఈ అకౌంట్‌ను తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ చూసుకోవాలి. 18 ఏళ్లు నిండిన తర్వాత పిల్లలు వాళ్ల అకౌంట్స్ వాళ్లే మేనేజ్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ ప్రయోజనాలు ఒక్కసారి కనీసం రూ.500, గరిష్టంగా ఒక సంవత్సరానికి రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. తర్వాత అకౌంట్ హోల్డర్ ప్రతి ఐదు సంవత్సరాల చొప్పున పొడిగించుకోవచ్చు. ప్రతి త్రైమాసికం ప్రభుత్వం వడ్డీ రేటు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ సంవత్సరానికి 7.10 శాతం వడ్డీ అందిస్తోంది. అకౌంట్ ఓపెన్ చేసిన డేటు, నిర్ణీత తేదీల నాటి బ్యాలెన్స్‌ను బట్టి రుణాలు, డబ్బు తీసుకునే వీలుంటుంది. ఆదాయ పన్ను చట్టం, సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. PPF అకౌంట్‌పై వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంచుకోవచ్చు, వాటాలు నిర్ణయించవచ్చు. * పిల్లల పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ భారత పౌరుడు ఎవరైనా తమ పిల్లల పేరు మీద PPF అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పిల్లలకు వయస్సు పరిమితి లేదు. కనీస ప్రారంభ డిపాజిట్ రూ.500. సంవత్సరానికి కనీస పెట్టుబడి రూ.500. ఒక ఆర్థిక సంవత్సరంలో (పేరెంట్స్ PPF సహా) పెట్టుబడి పెట్టగల గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు. పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పన్ను ప్రయోజనాలు పొందుతుంది. * గుర్తుంచుకోవాల్సిన విషయాలు పరిమితికి మించి ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్ చేయవచ్చు లేదా పలు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కూడా డిపాజిట్ చేయవచ్చు. ప్రతి నెలా 5వ తేదీ నుంచి నెల చివరి వరకు ఖాతాలో ఉండే మినిమమ్ బ్యాలన్స్‌పై వడ్డీని లెక్కిస్తారు. నెలనెలా ఇలా వడ్డీ పెరుగుతూ పోతుంది. ఏటా మార్చి 31వ తేదీన అన్ని నెలల్లో సంపాదించిన వడ్డీ ఖాతాలోకి జమ అవుతుంది. కొన్ని సందర్భాల్లో, PPF ఖాతాను 15 సంవత్సరాలు పూర్తికాకుండానే ముందుగానే క్లోజ్ చేయవచ్చు. ఖాతాదారుడికి ప్రాణాంతక వ్యాధి ఉన్నప్పుడు, ఉన్నత విద్య అవసరాలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో (ఉదాహరణకు, సైనిక సేవలో చేరడం) వంటి సందర్బాల్లో అకౌంట్ ముందుగానే క్లోజ్ చేయవచ్చు.ఖాతాదారుడి జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులకు ప్రాణాంతక వ్యాధి ఉంటే వైద్య పత్రాలు, వైద్య నివేదికలను సమర్పించాలి. అకౌంట్ హోల్డర్ లేదా పిల్లల ఉన్నత విద్య డాక్యుమెంట్‌లు చూపించాలి. నివాస స్థితి మారినప్పుడు పాస్‌పోర్ట్, వీసా లేదా ఆదాయ పన్ను రిటర్న్ కాపీని సమర్పించాలి. * అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? ఏ అథారైజ్డ్ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ బ్రాంచ్‌లోనైనా PPF ఖాతా తెరవవచ్చు. అకౌంట్ తెరవడానికి, అకౌంట్ ఓపెనింగ్ ఫామ్‌ను ఫిల్ చేసి, ఐడెంటిటీ డాక్యుమెంట్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. #investments #ppf-account మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి