Elections : వీటిల్లో ఏది ఉన్నా ఓటేయొచ్చు.. ఏపీ, తెలంగాణల్లో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్పు రాలేదని బెంగపడుతున్నారా...ఏం పర్లేదు, ఈరెండూ లేకపోయినా మీరు హాయిగా వెళ్ళి ఓటేయొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఒకటి ఏదైనా మీ దగ్గర ఉంటే చాలు..ఓటేసేయొచ్చు. By Manogna alamuru 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Voter Identity Cards : దేశంలో ఎవరు ఓటేయాలన్నా ఓటరు కార్డు(Voter Card) ఉండాల్సిందే. ఒక వేళ ఏ కారణాల వల్లన అయినా ఓటరు కార్డు లేకపోతే.. ఓటు వేయడానికి అర్హతగా కొన్ని గుర్తింపు కార్డులను సూచించింది భారత ఎన్నికల సంఘం(Election Commission). వాటిల్లో ఏది ఉన్నా ఓటు హాయిగా వేసిరావచ్చని తెలిపింది. ఓటర్ స్లిప్పు రాకపోయినా పర్వాలేదు. దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్(Polling Booth) కు వెళ్ళి గుర్తింపు కార్డును చూపిస్తే చాలు ఓటు వేయొచ్చు. పోలింగ్ కేంద్రంలో ఉన్న బీఎల్వోల దగ్గరకు వెళ్ళాలి. వారు ఓటర్ జాబితాలో సరి చేసి ఒక చీటీ మీద క్రమసంఖ్య, పేరు రాసి ఇస్తారు. దాని ప్రకారం వెళ్ళి ఓటు వేసేయడమే. అయితే దానికి గతంలో ఎక్కడకు వెళ్ళి ఓటు వేసారో అక్కడి బీఎల్వో(BLO) లను కలవాలి. కొత్తగా ఓటు వచ్చిన వారు మాత్రం నమోదు చేసుకున్నప్పుడు ఏ కేంద్రం అని చెప్పారో అక్కడికే వెళ్ళి చీటీ పొందాల్సి ఉంటుంది. ఓటు వేయడానికి పనికివచ్చే గుర్తింపు కార్డులు ఓటరు కార్డు లేకపోయినా ఈ కింది గుర్తింపు కార్డులుంటే ఎవరైనా ఓటేయొచ్చు. 1.పాస్‌పోర్ట్ 2. డ్రైవింగ్ లైసెన్స్ 3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డులు, 4. బ్యాంకులు, తపాలా ఆఫీసుల్లో జారీ చేసే ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు 5. పాన్‌కార్డ్ 6. ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ 7. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ 8. ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డ్ 9. ఫొటోతో కూడిన పింఛను పత్రం 10. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు 11. ఆధార్‌కార్డ్ Also Read:Delhi: యాక్షన్‌లోకి దిగిపోయిన ఆప్ సీఎం కేజ్రీవాల్..ఢిల్లీలో రోడ్‌షో #telangana #ap-elections-2024 #vote #voter-id-card మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి